టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), కేంద్ర మాజీ మంత్రి (Ex Central Minister)పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్(Goa Governer)గా నియమితులయ్యారు. 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ ఆరుసార్లు ఎమ్మెల్యే (Six Times MLA)గా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆయనకు పౌరవిమానశాఖ మంత్రిగా సేవలందించిన అనుభవం ఉంది. హర్యానాకు కొత్త గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ నియమితులవ్వగా, లడాఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆర్‌ఎస్‌ఎస్ నేత కవీందర్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగియడంతో హర్యానాకు కొత్త గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ వస్తుండటం. కవీందర్ గుప్తా ఇప్పటికే జమ్మూ మేయర్, జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి దాకా..
విజయనగరం జిల్లా ప్రజలకు, రాష్ట్ర రాజకీయా వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనరగ సంస్థాన వారసుడే అయినప్పటికీ సిసలైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. గ్వాలియర్‌లోని సింధియా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో చదువుకున్నారు. 1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరఫున విజయ నగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు..
1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కీలక నాయకుడిగా పేరు పొందిన అశోక్ గజపతిరాజు టీడీపీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా (2014 లోక్‌సభ) విజయం సాధించారు. 2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఎక్సైజ్, వాణిజ్య, ఆర్థిక, రెవెన్యూ, శాసనసభా వ్యవహారా శాఖల మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.