end
=
Sunday, July 6, 2025
వార్తలురాష్ట్రీయంఉత్తమ వైద్యులకు పురస్కారాలు
- Advertisment -

ఉత్తమ వైద్యులకు పురస్కారాలు

- Advertisment -
- Advertisment -

రెడ్క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్

వైద్యవృత్తి(Medical Field) లో నిరంతరంగా ప్రజాసేవ చేస్తున్న వైద్యుల(Best Doctors)ను గౌరవించేందుకు హైదరాబాద్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ (Red Cross Society) ఆధ్వర్యంలో ‘మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025′(Medical Excellence Awards) వేడుకను ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ డే(Doctor`s Day) సందర్భంగా జరిగే ఈ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సోమాజిగూడ సంస్కృతి రాజ్ భవన్ (Sanskruthi Raj Bhavan) కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ & రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు హరిచందన ఐఏఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం. దాన కిషోర్, ఐఏఎస్ గౌరవ అతిథిలుగా పాల్గొన్నారు. తెలంగాణ రెడ్క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాములు, డా. ఓ.ఎస్. రెడ్డి స్టేట్ ట్రెజరర్, నేషనల్ కమిటీ మెంబర్ డా. పి. విజయచందర్ రెడ్డి వరంగల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

అవార్డులు దక్కింది వీరికే..
రెడ్క్రాస్ సొసైటీ నిర్వహించిన ‘మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025’ లో పులువురు డాక్టర్లు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. వైద్య వృత్తిలో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ జె. వెంకటీ – జిల్లా వైద్య ఆరోగ్య అధికారి హైదరాబాద్ జిల్లా, డా. జయమాలినీ – అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి హైదరాబాద్, డా. సాయిబాబా – ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, కింగ్ కోటి, డా. జయశ్రీ – ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, లాలాపేట్,

డా. మురళి – ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, గోల్కొండ, డా. విజయ నిర్మల – ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, శ్రీరాం నగర్, డా. శ్రీకళ – ప్రోగ్రాం ఆఫీసర్, బాల్యదోష నివారణ (బీడీకే), డా. అశ్రిత రెడ్డి – ప్రోగ్రాం ఆఫీసర్, ఎన్సీడీ, డా. ఐషా – వైద్య అధికారి, ముషీరాబాద్​ అర్బన్​ పీహెచ్​సీ వైద్యాధికారి డాక్టర్​ మనోజ్​​, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, కుమ్మర్వాడి ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్, రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు హరిచందన ఐఏఎస్ మాట్లాడుతూ..

ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు పురస్కారాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మరిన్ని ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. కాగా పురస్కారాలు అందుకున్న డాక్టర్లు మాట్లాడుతూ పురస్కారాలు అందుకోవడంతో మాకు మరింత బాధ్యత పెరిగిందని పేర్కాన్నారు. ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించి వైద్య వృత్తికి కృషి చేస్తామని తెలిపారు.

రెడ్క్రాస్ ఆరోగ్య సేవలో..
సీపీఆర్ కన్వీనర్ డా. ఎన్. కీర్తన యాదవ్, జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెడ్క్రాస్ సమాజానికి అందిస్తున్న సేవల స్ఫూర్తితో వైద్యులు ప్రజల ఆరోగ్య సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి, అత్యుత్తమ వైద్యులను సత్కారించారు. ఈ కార్యక్రమంలో కె. విజయ కుమారి, ఈ.వి. శ్రీనివాస్, ఎల్. అనంతరావు, పి. వీరమణి, పి. జ్యోతి, రాధాకృష్ణ, మిది రియాజుద్దీన్, డా. అబ్దుల్ మజీద్, వి. మణీదీప్, కోటి ధర్మతేజ్, అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -