end
=
Wednesday, May 15, 2024
రాజకీయంబండి సంజయ్ అరెస్టు..
- Advertisment -

బండి సంజయ్ అరెస్టు..

- Advertisment -
- Advertisment -

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూర్ లో బండి సంజయ్ దీక్ష మొదలుపెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు బండి సంజయ్ దీక్షను అడ్డుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసు వాహనాన్ని ముందుకు కదలనీయకుండా పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందంటూ వార్తలు వచ్చాయి.

దీంతో పార్టీ నేతలు కవిత ఇంటి ముందు నిరసన చేశారు. దీంతో పోలీసులు అలర్టై వారిని అరెస్టు చేశారు. అంతే కాకుండా వారిపై కేసులు నమోదు చేశారు. లిక్కర్‌ స్కామ్‌పై నిజాలు తేల్చెంత వరకు ఎవరినీ వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో భారీ కమీషన్ల కోసం ఆమె ఇందులో పాల్గొన్నారని ఘాటు విమర్శలు చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -