end
=
Monday, August 18, 2025
సినీమాఅందగత్తె.. మంచి నటి.. కానీ !
- Advertisment -

అందగత్తె.. మంచి నటి.. కానీ !

- Advertisment -
- Advertisment -

‘మల్లేశం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య నాగళ్ల, ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ నటి.. వరుసగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, ఆమెకు రావాల్సిన అంత బజ్​ రాలేదు. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ, స్టార్‌డమ్ దక్కించుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. బీటెక్ చదివిన అనన్య, తర్వాత కొంతకాలం సాఫ్ట్‌వేర్ జాబ్​ చేశారు. సినిమాలపై ఉన్న మక్కువతో ఆమె ఉద్యోగాన్ని సైతం వదులుకొని సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన తొలి లఘుచిత్రం ‘షాదీ’. చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆమె నటించిన 12 చిత్రాల్లో కేవలం రెండూ మాత్రమే విజయం సాధించాయి. అయినప్పటికీ, చిన్న పాత్రలను కూడా చిన్నచూపు చూడకుండా, సెకండ్ హీరోయిన్‌గా కూడా నటించడానికి ఆమె వెనుకాడలేదు. ప్రకటనలు, ఈవెంట్లతో బిజీగా ఉన్నప్పటికీ, ఒక హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కించుకోవాలనే ఆమె ఆశ ఇంకా నెరవేరలేదు. టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసిరావడం లేదనే భావన ఆమె అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రేజీ హీరోయిన్‌కు మంచి విజయం లభించి, త్వరలోనే ఆమె కెరీర్ ఊపందుకుంటుందని ఆశిద్దాం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -