end
=
Monday, January 26, 2026
రాజకీయంజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
- Advertisment -

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

- Advertisment -
- Advertisment -

Jubilee Hills By-election: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం బీజేపీ (BJP)తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానానికి లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy)పేరును పార్టీ కేంద్ర అధిష్టానం ఖరారు చేసింది. దీపక్ ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నిక అనివార్యంగా మారిన నేపథ్యం 2024 జూన్ 8న చోటు చేసుకుంది. అప్పట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతిచెందడంతో నియోజకవర్గం ఖాళీ అయ్యింది. దాంతో ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగనుంది.

ఈ నేపథ్యంలో బీజేపీలో అభ్యర్థి ఎంపికపై చర్చలు చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్ వంటి పేర్లు జోరుగా వినిపించాయి. అయితే చివరకు లంకల దీపక్ రెడ్డినే అధిష్టానం ఎంపిక చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో అభ్యర్థిత్వం ఖరారయ్యింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి దగ్గర వ్యక్తిగా పేరున్న దీపక్ రెడ్డికి ఈ అవకాశాన్ని ఇవ్వడం గమనార్హం. 2023 ఎన్నికల్లో దీపక్ రెడ్డి బలంగా పోటీ చేసినప్పటికీ, ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో మూడో స్థానానికే పరిమితమయ్యారు. అయినప్పటికీ, పార్టీకి గ్రామస్థాయిలో ఉన్న పటిష్ట మద్దతు, కార్యకర్తల మీద ఉన్న పట్టును ఆధారంగా పెట్టుకొని ఈసారి విజయం సాధించాలన్న ధీమాతో బీజేపీ ఆయనపై మరోసారి భారం వేసింది.

ఇక, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునిత పోటీలో ఉన్నారు. మాగంటి సునిత, మృతిచెందిన గోపీనాథ్ సతీమణి కావడం విశేషం. ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశముంది. ఇదిలా ఉండగా, టికెట్ తనకే ఖాయమని భావించిన జూటూరు కీర్తిరెడ్డికి బీజేపీ ఈ నిర్ణయంతో షాక్ ఇచ్చినట్టయ్యింది. పార్టీలో గల అంతర్గత సమీకరణాలు, వర్గపోరు కూడా అభ్యర్థి ఎంపికపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఇటీవల బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో విశేష చురుకుగా మారిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీపక్ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ కార్యచరణ సిద్ధం చేస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -