భారత జనతా పార్టీ (బీజేపీ) (Bharatiya Janatha Party) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు (Party State President)ఎవరు..? అన్న సస్పెన్స్‌కు అధిష్ఠానం తెరదించింది. పార్టీ దళపతిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ex MLC Ramachander Rao) పేరును ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పదవికి నామినేషన్ వేయాలని ఆదేశించింది.
రామచందర్‌రావు మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్ దాఖలు (Nomination Will be Submitted)చేస్తారు. ఇక ఆయన గెలుపు లాంఛనమనే చెప్పాలి. రామచందర్‌రావు చదువుకునే రోజుల నుంచే నాటి భారతీయ జన సంఘ్ అనుబంధ సంఘమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) (Akhila Bharata Vidyarthi Parisad)లో విద్యార్థి నేతగా పనిచేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శిగా, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయవాదిగా పార్టీకి లీగల్ సెల్ కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన శాసన మండలి ఎన్నికల్లో గెలిచి శాసనమండలి సభ్యుడయ్యారు.
2017లో పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారు. 2021లో జరిగిన మండలి ఎన్నికల్లో మళ్లీ ఓటమి చెందారు.