Karnataka : కర్ణాటకలో సీఎం మార్పు(Change of CM) చర్చలు మళ్లీ వేడెక్కుతున్న వేళ, కాంగ్రెస్ (Congress) అంతర్గత పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (CM Siddaramaiah, Deputy CM DK Shivakumar)ల పరస్పర భేటీలు, అల్పాహార సమావేశాలు రాజకీయ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బ్రేక్‌ఫాస్ట్ పొలిటిక్స్’ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్‌లో ప్రధాన చర్చగా మారింది. ఇటీవల ఇద్దరు శక్తివంతమైన నేతలు వరుసగా ఒకరినొకరు కలవడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రోజుల క్రితం డీకే శివకుమార్ స్వయంగా సీఎం సిద్ధరామయ్య నివాసానికి వెళ్లడం రాజకీయంగా పెద్ద సందేశంగా భావించారు. దాంతోనే అసలు నాయకత్వ మార్పు చర్చలకు ఇది సంకేతమా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నడుమ, తాజాగా సీఎం సిద్ధరామయ్య డీకే ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్లడం మరోసారి దృష్టిని అందుకుంది.
డీకే శివకుమార్ తన ఇంటికి వచ్చిన సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి అల్పాహారం చేస్తూ సుమారు గంట పాటు వివిధ అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏం మాట్లాడుకున్నారనే వివరాలు బయటకు రానప్పటికీ, జరుగుతున్న రాజకీయ చర్చల నేపధ్యంలో ఈ సమావేశం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటికే శనివారం ఉదయం డీకే సీఎం ఇంటికి వెళ్లి అల్పాహారం చేసిన విషయం తెలిసిందే. ఆ భేటీ అనంతరం ఇద్దరు నేతలు కలిసి పార్టీలో ఐక్యత కొనసాగుతుందన్న సందేశం ఇచ్చారు. నాయకత్వ మార్పు వార్తలపై తెరదించేందుకు ఇది ప్రయత్నమని కొందరు భావించారు. అయితే సమావేశాలు ఇక్కడితో ఆగకుండా వరుసగా జరుగుతుండటంతో మరిన్ని ఊహాగానాలు బయటకొస్తున్నాయి.
తనను మంగళవారం అల్పాహారానికి రావాలని డీకే కోరారని, కానీ ఇంకా అధికారిక ఆహ్వానం అందలేదని ముందుగా సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఆహ్వానం వస్తే తప్పకుండా వెళ్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన డీకే శివకుమార్ నాకు, మా సీఎంకు మధ్య ఉన్నదంతా అంతర్గత విషయం. మేమిద్దరం అన్నదమ్ముల్లా పని చేస్తాము అని చెప్పారు. అదే సమయంలో అధికారికంగా సీఎంకు తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానం పంపారు. డీకే ఇచ్చిన ఆహ్వానం మేరకు సీఎం సిద్ధరామయ్య ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. వరుస భేటీలు జరుగుతుండటంతో, కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అల్పాహార దౌత్యం ద్వారా ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నాయకత్వంపై స్పష్టత ఎప్పుడు వస్తుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్‌టాపిక్ గా మారాయి.
Bengaluru | Karnataka CM Siddaramaiah reaches Dy CM DK Shivakumar's residence, at his invitation, for a breakfast meeting
Source: Office of DK Shivakumar pic.twitter.com/fOnISUclp6
— ANI (@ANI) December 2, 2025
