end
=
Saturday, May 3, 2025
వార్తలుజాతీయంబజరంగ్ దళ్ మాజీ సభ్యుడి దారుణ హత్య
- Advertisment -

బజరంగ్ దళ్ మాజీ సభ్యుడి దారుణ హత్య

- Advertisment -
- Advertisment -

కర్ణాటకలోని మంగళూరు(Mangaloor)లో బజరంగ దళ్​ మాజీ సభ్యుడు(Ex Bajarang dal member) సుహాస్ శెట్టి (Suhas setty)దారుణ హత్య(Brutal murder)కు గురయ్యాడు. దుండగులు మారణాయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 1వ తేదీన రాత్రి 8 గంటలకు శెట్టి మరో ఐదుగురితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ కారును రెండు కార్లు వెంబడించాయి. కారు మంగళూరు సమీపంలోకి వెళ్లగానే దుండగులు శెట్టి కారును అడ్డగించాయి.

కార్ల నుంచి బయటకు దిగిన ఆరుగురు దుండగులు మారణాయుధాలతో శెట్టిపై విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చి పరారయ్యారు. శెట్టి 2022లో సూరత్కల్‌లో జరిగిన 23 ఏళ్ల యువకుడి హత్య కేసులో శెట్టి ప్రధాన నిందితుడని తెలిసింది. శెట్టి హత్యతో శుక్రవారం మంగళూరు ప్రాంతం అట్టుడికింది. హిందూ ధార్మిక సంఘాల కార్యకర్తలు, బీజేపీ నేతలు బంద్​కు పిలుపునిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు భారీగా ఆ ప్రాంతంలో భద్రతా దళాలను రంగంలోకి దించారు. ” హిందూ కార్యకర్త హత్యకు గురయ్యాడు. కర్ణాటక హిందువులకు సురక్షితమైన ప్రదేశం కాదు.

శెట్టి హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి దుండగులను అదుపులోకి తీసుకోవాలి. కఠినంగా శిక్షించాలి” అని ఎమ్మెల్యే భరత్ శెట్టి డిమాండ్​ చేశారు. డిమాండ్లపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర స్పందిస్తూ.. ” నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. శాంతిభద్రతలు కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.ఖ రాశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -