end
=
Wednesday, August 13, 2025
వార్తలురాష్ట్రీయంసీబీఐ చేతికి అడ్వొకేట్ దంపతుల హత్య కేసు
- Advertisment -

సీబీఐ చేతికి అడ్వొకేట్ దంపతుల హత్య కేసు

- Advertisment -
- Advertisment -

పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021లో తెలంగాణ (TG State)లో సంచలనం సృష్టించిన (created a sensation) గట్టు వామన్‌రావు, నాగమణి (Vamana Rao and Nagamani) అడ్వొకేట్ దంపతుల (Advocate Couple) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను (Responsible for investigating the case) తాజాగా సుప్రీం కోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)(Central Bureau of Investigation)కు

అప్పగిస్తూ తీర్పునిచ్చింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగా దారుణంగా దండగులు ఆ దంపతులను హత్య చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి, హత్యకు సంబంధించిన వీడియోలు సహా ఆధారాలన్నింటినీ న్యాయస్థానానికి సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్రప్రభుత్వం సమర్పించిన అనేక రికార్డులను, అలాగే వామన్‌రావు మరణ వాంగ్మూలం వీడియో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులకు స్పందించి, ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తే తమకు అభ్యంతరం లేదని కోర్టుకు తన సమాధానాన్ని సమర్పించింది.

దీనిపై తాజాగా జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్‌కే సింగ్ ధర్మాసనం విచారించి, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, మృతుడు వామన్‌రావు తండ్రి కిషన్‌రావుకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -