end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంమనం చూసిన దైవస్వరూపం సత్యసాయి: సీఎం చంద్రబాబు
- Advertisment -

మనం చూసిన దైవస్వరూపం సత్యసాయి: సీఎం చంద్రబాబు

- Advertisment -
- Advertisment -

Sathya Sai Centenary Celebrations : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)పుట్టపర్తి (Puttaparthi)లో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొని, సత్యసాయి బాబా చూపిన లోకకల్యాణ మార్గాన్ని స్మరించుకున్నారు. విశ్వశాంతి, సర్వమానవసేవ, పరమప్రేమ ఇవే సత్యసాయి బాబా బోధనలు అని ఆయన పేర్కొన్నారు. భూమిపై దర్శనమిచ్చిన దైవస్వరూపం సత్యసాయి బాబానే అని కొనియాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రేమ, సేవా సిద్ధాంతం అపార లక్షల మందిని ప్రభావితం చేసిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాట్లాడుతూ..“మానవసేవే మాధవసేవ’’ అన్న భావనను బాబా జీవితం అంతా ఆచరించారని గుర్తుచేశారు. తాగునీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాల కోసం ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎప్పటికీ నిలిచే మైలురాళ్లని అన్నారు.

దేశంలోని 1600 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడమే కాకుండా, విద్యా రంగంలో 102 పాఠశాలలు, వైద్య సేవల కోసం పలు ప్రముఖ ఆసుపత్రులు సత్యసాయి సంస్థ ద్వారా స్థాపించబడ్డాయని వివరించారు. ప్రస్తుతం 140 దేశాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల ద్వారా 7 లక్షలకు పైగా వాలంటీర్లు నిస్వార్థ సేవచేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించే సేవా సంస్థగా సత్యసాయి ట్రస్ట్ నిలిచిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజం మొత్తం ప్రేమతో నిండి ముందుకు సాగాలంటే సత్యసాయి బోధనలు మార్గదర్శకాలని, ఆయన చూపిన దారిలో నడవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సత్యసాయి బాబా వంటి ఆధ్యాత్మిక శక్తులు ప్రపంచంలో చాలా అరుదని పేర్కొన్నారు. అభివృద్ధిలో చాల వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఇంత గొప్ప వ్యక్తి జన్మించడం ఆ ప్రాంతానికి భాగ్యంగా భావించారు.

విదేశాల పర్యటనల్లో కూడా అనేక మంది సత్యసాయి భక్తులను కలుసుకున్నానని, ఆయన ప్రభావం దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని అన్నారు. సాధారణ ప్రజలకు తాగునీరు అందించాలన్న సంకల్పంతో సత్యసాయి చేపట్టిన పనులు తర్వాత ప్రభుత్వాలు అమలు చేసిన జల్ జీవన్ మిషన్ తరహాలో ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. సేవలో ఆయన చూపిన కట్టుబాటు, శ్రమ, విశ్వవ్యాప్త దృష్టి అందరికీ ఆదర్శమని తెలిపారు. సచిన్ టెండూల్కర్ సహా పలు క్రీడ, సినీ, సాహిత్య, బ్యూరోక్రసీ రంగాల ప్రముఖులు సత్యసాయితో స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సత్యసాయి బోధనలు, సేవా భావనను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -