భారత ప్రధాని (Indian Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)శుక్రవారం రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ఫోన్ చేసి, భారతదేశానికి రావాలని ఆహ్వానించారు(Inviting to india). ఈ ఏడాది చివరిలో జరిగే 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు (To participate in the annual summit)లో పాల్గొనాలని మోదీ పుతిన్‌ను కోరారు.
ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై (strengthening the partnership) కూడా వారు చర్చించుకున్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించి పుతిన్ మోదీకి వివరించగా, ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించినట్లు తెలుస్తోంది. దీనికి భయపడబోమన్న మోదీ, రష్యాతో వాణిజ్య, దౌత్య సంబంధాలను పటిష్టం చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ తన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రష్యాకు పంపించారు. ఈ వివరాలను ప్రధాని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేయగా, మోదీ కూడా తన ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.