end
=
Friday, January 9, 2026
వార్తలురాష్ట్రీయంసికింద్రాబాద్ అస్థిత్వంపై కాంగ్రెస్ కుట్రలు : తలసాని శ్రీనివాస్
- Advertisment -

సికింద్రాబాద్ అస్థిత్వంపై కాంగ్రెస్ కుట్రలు : తలసాని శ్రీనివాస్

- Advertisment -
- Advertisment -

Secunderabad : సికింద్రాబాద్‌కు ఉన్న ఘనమైన చరిత్ర(Great history)ను, ప్రత్యేక గుర్తింపును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani Srinivas Yadav) తీవ్ర ఆరోపణలు చేశారు. పద్మారావునగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సికింద్రాబాద్ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ చరిత్ర, సంస్కృతి, సాంస్కృతిక వైవిధ్యం ఎంతో విశిష్టమైనవని, అలాంటి ప్రాంతాన్ని విలీనం చేయడం లేదా ప్రత్యేకతను తగ్గించే నిర్ణయాలు తీసుకోవడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని తలసాని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని దెబ్బ అని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11వ తేదీన బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తలసాని వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వాణిజ్య–వ్యాపార సంఘాల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కాలనీలు, బస్తీల కమిటీ సభ్యులు హాజరుకానున్నారని తెలిపారు. సికింద్రాబాద్ భవిష్యత్ దిశను నిర్ణయించేలా ఈ సమావేశం కీలకంగా మారనుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీపై, అలాగే భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు.

సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తలసాని హెచ్చరించారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే దశలవారీగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ఉద్యమం కాదని, సికింద్రాబాద్ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ ప్రత్యేకతను, చరిత్రను కాపాడుకోవాలంటే ప్రజలంతా ఒక్కటై నిలవాల్సిన సమయం వచ్చిందని తలసాని పిలుపునిచ్చారు. ప్రజల ఐక్యతే ఈ ఉద్యమానికి బలం అవుతుందని, అదే సికింద్రాబాద్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -