end
=
Sunday, January 25, 2026
రాజకీయంరాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం
- Advertisment -

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisment -
- Advertisment -

Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకునే వేళ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ‘ప్రజా పాలన’ ఉత్సవాలను (Praja Palana Vijayotsavalu ) నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న పథకాల ప్రగతి, రాబోయే లక్ష్యాలను సమగ్రంగా ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)డిసెంబర్ 1 నుంచి జిల్లాల పరంగా విస్తృత పర్యటన ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి మొదలయ్యే ఈ రాష్ట్ర పర్యటన డిసెంబర్ 7 వరకు కొనసాగుతుంది. ప్రతీ జిల్లాలో ప్రజలతో నేరుగా చేరి, వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించే అవకాశం ఈ పర్యటనతో లభించనుంది.

ఈ పర్యటనలో భాగంగా పలు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన సంక్షేమ, మౌలిక వసతుల కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం సిద్ధమయ్యారు. ప్రతి జిల్లాలో ప్రజాసభలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన కీలక నిర్ణయాలు, అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతు–యువత–మహిళల కోసం ప్రారంభించిన కార్యక్రమాల గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన విజయాలు, పరిపాలన పారదర్శకత, ప్రజా ఆశయాల ప్రతిబింబంగా తీసుకొచ్చిన నిర్ణయాలు వంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి వచ్చిన సూచనలను భవిష్యత్ నిర్ణయాల్లో పరిగణలోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు, డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047’ను విడుదల చేయనున్నారు. వచ్చే దశాబ్దాల్లో రాష్ట్ర అభివృద్ధికి దారిచూపే ప్రణాళికలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక–పరిశ్రమ రంగాల్లో తెలంగాణ సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడమే ఈ సమ్మిట్ లక్ష్యం. రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ప్రతిభకు గ్లోబల్ అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ఈ రెండు రోజుల అంతర్జాతీయ సమ్మిట్ ప్రభావం ఉండనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ సమగ్ర కార్యచరణలు, రాబోయే సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధికి మరింత దిశానిర్దేశం చేయనున్నాయి.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -