end
=
Saturday, July 12, 2025
వార్తలుజాతీయంబీహార్‌లో ప్రతిపక్ష ఓట్ల తొలగింపు కుట్ర?
- Advertisment -

బీహార్‌లో ప్రతిపక్ష ఓట్ల తొలగింపు కుట్ర?

- Advertisment -
- Advertisment -

రాహుల్ గాంధీ ఆరోపణ

మహారాష్ట్ర తరహా(Like Maharastra)లో బీహార్‌లోనూ ఓటర్ల జాబితా (Voter List)లో గోల్‌మాల్ జరిగిందని ఏఐసీసీ అగ్రనేత (AICC Top Leader) రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఎన్నికల సంఘం (Election Commission) తీసుకున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల ‘మహాఘట్‌ బంధన్’ బుధవారం బీహార్ బంద్‌కి పిలుపునిచ్చింది.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ బంద్‌లో పాల్గొన్నారు. హాజీపూర్, సోన్‌పూర్‌ ప్రాంతాల్లో ఆర్జేడీ కార్యకర్తలు టైర్లు కాల్చి రోడ్లను దిగ్బంధించారు. బంద్​లో రాహుల్​ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర ఎన్నికల ముందు ఒక్క వారం రోజులకే దాదాపు కోటి మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారు. అదే స్కెచ్ బీహార్‌లోనూ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విలువలను రక్షించాల్సింది పోయి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోంది’ అని ఆరోపించారు.

మహాఘట్‌బంధన్‌కి కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వీఐపీ పార్టీ, పప్పు యాదవ్ లాంటి నేతలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా చక్కాజామ్‌ నిర్వహించారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -