వర్షాకాలం… సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అది కూడా కొంచెం క్రిస్పీగా ఉంటే మరీ క్రేజీగా ఉంటుంది. సాధారణంగా మిర్చీ బజ్జీ తయారు చేసుకోవడం మామూలే. ఈ వర్షాకాలంలో రోడ్ల పక్కన వేడి వేడి మక్కజొన్నపొత్తులు కాలుస్తుంటే ఎవరు తినక ఊరుకుంటారు. కానీ అవే మక్కలను ఇంటికి తీసుకెళ్లి కొంచెం వెరైటీగా ఆలోచించి వడల రూపంలో తింటే సూపర్‌గా ఉంటుంది కదా!
అయితే మక్క వడలు ఎలా తయారు చేయాలో చూద్ధాం…
కావల్సిన పదార్థాలు ః
ఒలిచిన మక్క గింజలు
అల్లం వెల్లుల్లి పేస్టు
పచ్చి మిరపకాయలు
ధనియాలపొడి
కరివేపాకు
పసుసు
ఉల్లిపాయ
తయారీ విధానం
మక్కలను ఒలిచి అల్లం వెల్లుల్లి పేస్టు, మిరపకాయలు, ధనియాల పొడి, కరివేపాకు, పసుపు, ఉల్లిగడ్డ తదితరాలు గ్రైండర్‌లో వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. అనంతరం దాంతో వడలు వేసుకొంటే సరిపోతుంది. వేడి వేడిగా, నోరూరించే ఫలారం రెడీ!
పోషక విలువలు: ఒక కప్పు (160 గ్రాముల) మక్కల్లో లభించే పోషకాలు
క్యాలరీస్ : 133 గ్రా., కార్బోహైడ్రేట్స్ : 30.8, కొవ్వు: 1.5 గ్రా.,
ప్రొటీన్ : 4.9 గ్రా., విటమిన్స్ : 173.8 గ్రా.,
పొటాషియం : 329 మి.గ్రా., క్యాల్షియం : 24.6 మి.గ్రా., మెగ్నీషియం :24.6 మి.గ్రా.,సోడియం : 489 మి.గ్రా., నీరు : 126 గ్రా.