end
=
Monday, April 29, 2024
ఫీచ‌ర్స్ ‌వంటలుMutton:మటన్ కడై కర్రీ తయారీ
- Advertisment -

Mutton:మటన్ కడై కర్రీ తయారీ

- Advertisment -
- Advertisment -

వీకెండ్(Weekend) వచ్చింది అంటే చాలు రెస్టారెంట్ చుట్టూ తిరుగుతున్న రోజులువి. రెస్టారెంట్(Restaurant) లో అయితే మనకి ఇష్టం ఇచ్చిన ఫుడ్ అరగంట లేదా 20 నిమిషాల్లో మన ముందు ఉంటుంది.ఈ రోజుల్లో అందరూ బయట ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. రెగ్యులర్ గా మనం నాన్స్ తో కడై చికెన్(Kadai Chicken) లేదా కడై పన్నీర్ ట్రై చేసి ఉంటారు. మటన్ చాలా తక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. మటన్ కడై కర్రీ ఎలా చేసుకోవలో తెల్సుకుందాం.

కావల్సిన పదార్థాలు:

మటన్ – కే‌జి, ఉల్లిపాయలు, టమోటో-2, అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 స్పూన్, పచ్చిమిర్చి–6, తగినంత కారం, గరం మసాలా, మీట్ మసాలా, పౌడర్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కస్తూరి మేతి(Kasuri Methi) ఒక స్పూన్,  కొత్తిమీర ఒక కప్ప, ఉప్పు-సరిపడా నూనె- తగినంత

తయారుచేయు విధానం:

ముందుగా మటన్ ని ప్రెజర్ కుక్కర్(Cooker) లో వేసి తగినంత నీరు పోసి కొద్దిగా పసుపు వేసి 2 విజిల్స్ వచ్చేదాక ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చాక అందులోని గ్యాస్ బయటికి వెళ్ళేదాక ఆగి లో ఆ మటన్ ను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడై తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడై తీసుకొని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయెదాక వేయించి తర్వాత టమోటోలు(Tomato) ముక్కలు వేసి మెత్తగా అయ్యాక చికలుగా చేసిన నాలుగు పచ్చిమిర్చి వేసి ధనియాలపొడి(Coriander Powder), గరం మసాలా, మరియు కొద్దిగా కారం వేసి ఈ మిశ్రమాన్ని వేయించాలి. ఫ్రై చేసిన మటన్ ముక్కలను వేసి కొన్ని నీరు పోసి కాసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో కస్తూరి మేతీ , మసాలా పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలిపి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. గ్రేవీ ఇంకా చిక్కగా రావాలి అనుకుంటే కొద్దిగా పెరుగు(Curd) వేసుకోవచ్చు. ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేస్తే అయిపోతుంది. అంతే ఎంతో యమ్మి యమ్మి కడై మటన్ గ్రేవీ(Gravy) రిసిపి రెడీ.  నాన్స్ తో లేదా పుల్క తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి చపాతీల్లో(Chapathi) కూడా బాగుటుంది.

(Paneer 65 : ప‌న్నీర్‌ 65 తయారీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -