end
=
Thursday, May 16, 2024
వార్తలురాష్ట్రీయం Siddipet:మెదక్–సిద్దిపేట నేషనల్ హైవే పనులు
- Advertisment -

 Siddipet:మెదక్–సిద్దిపేట నేషనల్ హైవే పనులు

- Advertisment -
- Advertisment -

  • భూసేకరణ పనులు వేగంగా జరపాలని మెదక్ , సిద్దిపేట జిల్లా కలెక్టర్లకు ఆదేశం.
  • నేషనల్ హైవే వెళ్లే గ్రామాల వద్ద  4 లైన్ రోడ్లు,  స్ట్రీట్ లైట్, సైడ్ డ్రైన్లు, రేలింగ్, ఫుట పాత్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
  •  ఆర్ అండ్ బి అధికారుల సమీక్షలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
  • మెదక్ జిల్లా – సిద్దిపేట నేషనల్ హైవే కు సంబధించి రీచ్ -1 , రీచ్ – 2 నేషనల్ హైవే 

మంత్రి హరీష్ రావు(Harish Rao)మాట్లాడుతూ రీచ్ -1 రీచ్ – 2  నేషనల్ హైవే సిద్దిపేట జిల్లాలోని  పోతారెడ్డిపేట్ నుండి రంగధామ్ పల్లి బ్రిడ్జి వరకు , రీచ్ -2 నేషనల్ హైవే మెదక్(Medak) జిల్లాలో మెదక్ టౌన్ నుండి నిజాం పేట వరకు నిర్మాణం సాగనున్నట్లు తెలిపారు. మెదక్ నుండి సిద్దిపేట వరకు882.18 కోట్లతో, 69.97 కిలోమీటర్ల వరకు 4 లైన్ రోడ్ , మెదక్ జిల్లాలో 33.676 కిలోమీటర్లు, సిద్దిపేట(Siddipet)లో 36.302 కిలోమీటర్లలో నాలుగు వరుసల రోడ్లు రానున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లాలో పోతిరెడ్డిపేట్, అక్బర్ పేట్, చిట్టాపూర్, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇర్కోడు, బూరుగుపల్లి గ్రామాలతో పాటు సిద్దిపేట పట్టణ పరిధిలో నాలుగు వరుసల రోడ్లు రానున్నట్లు మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో మెదక్ టౌన్ , పత్తూరు, అక్కన్నపేట్, రామాయంపేట్, కోనాపూర్, నందిగామా, నిజాంపేట్ గ్రామాలలో నాలుగు వరుసల రోడ్లు  రావడం వల్ల  ఈ గ్రామాల రూపు రేఖలు మారనున్నట్లు చెప్పారు. నేషనల్ హైవే(National highway) రోడ్డు సాగే గ్రామాల వెంట 4 లైన్ రోడ్,  స్ట్రీట్ లైట్స్, ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా రేలింగ్, ఇరువైపులా వర్షపు నీరు నిలువకుండా సైడ్ డ్రైన్లు, ఫుట్ పాత్(Foot path) లు నిర్మించాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు.

సిద్దిపేట టౌన్ లో  ఎన్ సాన్ పల్లి జంక్షన్ నుండి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు ఇరు వై పులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు(Service Road) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్ సాన్ పల్లి సర్కిల్ వద్ద వెహికల్  అండర్ పాస్, సిద్దిపేటలో హైదరాబాద్ – కరీంనగర్ – రామగుండం రోడ్ వద్ద వెహికల్ ఓవర్ పాస్ నిర్మించనున్నట్లు  ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. మెదక్ లో రామాయం పేట  ఎన్ హెచ్ 44 ను క్రాస్  చేసేందుకు వెహికల్ అండర్ పాస్, గజ్వేల్ రోడ్ లో రామాయం పేట సమీపంలో మరో వెహికల్ అండర్ పాస్(Vehicle underpass) నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  అక్కన్న పేట వద్ద వెహికల్ ఓవర్ పాస్  నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో అక్కన్నపేట్ వద్ద  రైల్వే ట్రాక్  ఉండటంతో అక్కడ వాహనాల పోయేందుకు రైల్ అండర్ బ్రిడ్జి(Under Bridge) నిర్మించనున్నట్లు అధికారులు మంత్రి హరీశ్ రావుకు వివరించారు. ఈ రోడ్ నిర్మాణం వల్ల సిద్దిపేటలో 4 మేజర్ జంక్షన్లు, 19 మైనర్ జంక్షన్లు అభివృద్ధి కానున్నాయి. మెదక్ జిల్లాలో 4 మేజర్ జంక్షన్లు, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి కానున్నట్లు  అధికారులు తెలిపారు. రామాయంపేటలో 2.65 కిలోమీటర్లు బైపాస్ రోడ్(Bypass Road) రానున్నట్లు మంత్రికి వివరించారు. ఈ పనుల కోసం మెదక్ జిల్లాలో  26.82 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మెదక్ జిల్లాలో 9 .35 హెక్టార్ల  అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు మంత్రి హరీశ్ రావుకు తెలిపారు.

మెదక్ జిల్లా కలెక్టర్(Collector) కు, సిద్దిపేట కలెక్టర్ కు పనులు వేగంగా జరగాలని, భూసేకరణ పనులు వేగంగా చెపట్టాలని మంత్రి హరీశ్ రావు పోన్ ద్వారా ఆదేశించారు. అటవీ భూముల కూడా సేకరించాల్సి ఉండటంతో ఫారెస్ట్ అధికారులో(forest officials)తోను మంత్రి హరీశ్ రావు ఫోన్లో మాట్లాడారు. అటవీ సేకరణ భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పనులు వేగంగా జరిపించాలని  రెండు జిల్లాల కలెక్టర్లను, ఆదేశించారు. ఆర్ యూబీలు, ఆర్వోబీలు నిర్మించేచోట వర్షాకాలంలో నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు వ హించాలని, అందుకు అనుగుణంగా డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని  ఆర్ అండ్ బి అధికారులను(R&B officials) ఆదేశించారు. హైవేస్ వల్ల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సైన్ బోర్డులు, రేడియంతో  ఏర్పాటు చేసే సూచికలు అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ సమీక్షలో  ఆర్ అండ్ బి నేషన్ ల్ హైవేస్ విభాగం ఈఈ ధర్మారెడ్డి, ఎస్. ఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అడ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

(Telangana:తెలంగాణలో ముగియనున్న భారత్ జోడో యాత్ర..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -