end
=
Thursday, May 16, 2024
వార్తలురాష్ట్రీయంNizamabad:యూట్యూబ్ క్లాసెస్ విని నీట్ ర్యాంక్ కొట్టిన యువతి..
- Advertisment -

Nizamabad:యూట్యూబ్ క్లాసెస్ విని నీట్ ర్యాంక్ కొట్టిన యువతి..

- Advertisment -
- Advertisment -

ప్రస్తుతం కాలంలో ఎంబీబీఎస్‌ (MBBS) సీటు సాధించాలనేది సగటు విద్యార్థి (Student) జీవిత (Target)లక్ష్యం. ఇందుకోసం ఎంతో కష్టపడి చదువుతుంటారు. పేరెంట్స్‌ (Parents) కూడా తమ పిల్లలు ఎలాగైనా సీటు సంపాదించాలని కార్పొరేట్‌ కాలేజీల్లో (Corporate) చదివిపిస్తుంటారు. రూ. లక్షలు ఫీజులు (Fee) పోసి కోచింగ్ (Coaching) ఇప్పిస్తుంటారు. కానీ, ఇవేవి లేకుండానే కేవలం సెల్ ఫోన్ (Cell phone)ఆధారంగా యూట్యూబ్‌ (You tube) వీడియోల్లో (Video) క్లాసులు (class)వింటూ నీట్ (NEET)ర్యాంక్‌ (Rank) కొట్టేసి ఔరా అనిపించింది నిజమాబాద్ (Nizamabad) యువతి.

నిజామాబాద్‌కు చెందిన హారిక‌ (Harika)ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్‌ (Entrance Test)లో స్టేట్ ర్యాంక్ (State rank) సాధించారు. ఎన్నో ఫీజులు కట్టి, ప్రత్యక్ష తరగతులకు హాజరైనా రాని స్టేట్‌ ర్యాంకును యూట్యూబ్‌లో క్లాసులు విని దేశంలోని బెస్ట్‌ ర్యాంకును (best) సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. హారిక పదో తరగతి (10th class), ఇంటర్మీడియట్ (intermediate)పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది హారికకు డాక్టర్ (Doctor) కావాలన్న కోరిక ఉన్నా నీట్ కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ప్రతి రోజూ యూట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్‌లో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో (State) 700 ర్యాంక్ సాధించి రికార్ట్ (Record)సృష్టించింది.

చదువుకోవాలనే సంకల్పం, ఏదైన సాధించాలనే సత్తా ఉండాలేకానీ సాకారం కానిది ఏదీ లేదని నిరూపించింది. ఏడ‌వ త‌ర‌గ‌తిలో ఉన్నప్పుడు త‌న టీచ‌ర్ (Teacher)చేప్పిన మాట‌లు డాక్టర్‌గా త‌న ల‌క్ష్యం నిర్దేశించుకోవ‌డానికి కార‌ణం అయ్యాయని హారిక చెబుతోంది. అప్పటి నుంచి డాక్టర్ కావడానికి ఎలా ప్రిపేర్ (Prepare)కావాలో సాధన మొదలు పెట్టానని తెలిపింది. అమ్మ (Mother) తామను చదివిపించడానికి పడ్డ కష్టాలు చూసే పట్టుదల మరింత పెరిగిందని చెప్పుకొచ్చింది. ర్యాంకు సాధించేకంటే ముందు హారిక రెండు సార్లు నీట్‌ పరీక్షకు హాజరైంది. అయితే ఆశించిన స్థాయిలో మార్కులను సాధించలేక పోయింది. కోచింగ్‌ తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేక యూట్యూబ్‌లోనే క్లాసులు విని ర్యాంకు సాధించిన హారిక ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

(Mutton:మటన్ కడై కర్రీ తయారీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -