end
=
Saturday, December 13, 2025
వార్తలుజాతీయందేశీయ విమానయాన రంగంలో సంక్షోభం: టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త చర్యలు
- Advertisment -

దేశీయ విమానయాన రంగంలో సంక్షోభం: టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త చర్యలు

- Advertisment -
- Advertisment -

Indigo: దేశీయ విమానయాన రంగాన్ని కుదిపేసిన తాజా సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం(Central Govt) దూకుడుగా స్పందించింది. ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఇండిగో(Airlines Indigo)లో ఉత్పన్నమైన కార్యకలాపాల అంతరాయం, వరుసగా విమానాల రద్దు, ఇందుకు అనుబంధంగా ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు భారీగా పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎకానమీ క్లాస్ చార్జీలపై పరిమితులు(Restrictions on economy class fares) విధిస్తూ నెల 6న కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఎయిర్ ఇండియా గ్రూప్ వెంటనే చర్యలు ప్రారంభించింది. తమ రిజర్వేషన్ వ్యవస్థల్లో కొత్త ధరల విధానాన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పూర్తిస్థాయిలో మార్పులను తీసుకురాగా, ఎయిర్ ఇండియా విమానాల్లో కూడా అన్ని బుకింగ్ ఛానళ్లలో సవరణ చేసిన ధరలు క్రమంగా ప్రతిబింబిస్తున్నాయని ప్రకటనలో పేర్కొంది. మరికొద్ది గంటల్లో ఈ మార్పులు మొత్తం సిస్టమ్స్‌లో ప్రత్యక్షమవుతాయని సంస్థ స్పష్టం చేసింది. కొత్త విధానం అమలులో భాగంగా థర్డ్ పార్టీ బుకింగ్ ప్లాట్‌ఫాం‌లతో సమన్వయం కీలక అంశంగా మారింది. ఈ కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా దశలవారీగా ప్రక్రియను అమలు చేస్తున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ మార్పుల సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించి బేస్ ఫేర్ చెల్లించిన ప్రయాణికులకు అదనంగా చెల్లించిన మొత్తం రీఫండ్ చేయబడుతుందని సంస్థ స్పష్టంగా పేర్కొంది.

ఇండిగోలో ఉత్పన్నమైన సంక్షోభం దేశీయ విమానయాన రంగంలో అస్థిరతను పెంచడంతో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. విమాన ఛార్జీల పెరుగుదలపై పర్యవేక్షణను పెంచుతూ, పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే వరకు అన్ని సంస్థలు ధరలను కట్టుదిట్టంగా నియంత్రించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు భారం కాకుండా ఉండేందుకు ధరల నియంత్రణతో పాటు సేవల సమన్వయం, బుకింగ్ వ్యవస్థల పారదర్శకతపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ చర్యలతో టికెట్ ధరల పెరుగుదలకు కొంతమేర ఆపుకోలు పెరగనుందని, అలాగే ఇండిగో సంక్షోభం ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కీలక పాత్ర పోషించనున్నాయన్న విశ్లేషణ నిపుణులదే. మొత్తం మీద, కేంద్రం జోక్యం దేశీయ విమానయాన రంగాన్ని స్థిరపడే దిశగా నడిపే చర్యగా భావిస్తున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -