ధర్మశాల : ఉత్తర ఐర్లాండ్ రాజకీయవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జాన్ హ్యూమ్ మృతికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రభోదకుడు దలైలామా మంగళవారం సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జాన్ హ్యూమ్ భార్యకు లేఖ రాశారు. ‘పలుమార్లు ఉత్తర ఐర్లాండ్ సందర్శించినప్పుడు హ్యుమ్‌ను కలిశాను. సంఘర్షణలు పరిష్కరించడం, సంభాషణ శక్తి, చర్చలపై ఆయనకు లోతైన విశ్వాసం ఉంది. నాయకత్వం, చర్చల శక్తిపై ఆయనకున్న నమ్మకమే 1998 గుడ్ ఫ్రైడే ఒప్పందానికి బాటలు వేసింది. తన నిలకడ స్వభావం, స్థిరమైన ఆలోచనలు మనందరికీ అనుసరణీయం. అర్ధవంతమైన జీవినం గడిపిన హ్యూమ్ మృతి బాధకరం’ అని లేఖలో పేర్కొన్నారు.