పవర్ స్టార్ (Power star) పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కథాయకుడిగా ప్రముఖ దర్శకుడు హరీశ్‌శంకర్ (Director Harish Shankar) తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Movie Ustad Bhagath Singh). ఎప్పటి నుంచో ఊరిస్తూ, ఊరిస్తూ ఉన్న ఈ చిత్రం త్వరలో శరవేగంగా షూటింగ్ జరుపుకోన్నది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్‌శంకర్ కాంబో(Awaiting For Combo)లో
రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో పవన్‌కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దర్శక నిర్మాతలు పవన్ అభిమానులకు ఓ శుభవార్త తెలియజేశారు. చిత్రంలో లీడ్ రోల్ కథానాయికగా శ్రీలీలతోపాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోందని తెలుపుతూ సోషల్‌మీడియా వేదికగా పోస్టర్లను పంచుకున్నారు. ఆమె ఎవరో కాదు.. బబ్లీ గర్ల్ రాశీఖన్నా.
చిత్రం బృందంగా తాజాగా అధికారిక ప్రకటన కూడా చేసింది. సినిమాలో రాశీఖన్నా ‘శ్లోక’ అనే పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న రాశీఖన్నా పాత్రతో సినిమాకు మరింత రానుందని బృందం స్పష్టం చేసింది.