end
=
Sunday, August 10, 2025
వార్తలుజాతీయంమన డిఫెన్స్​ ఉత్పత్తి విలువ ఎంతో తెలుసా?
- Advertisment -

మన డిఫెన్స్​ ఉత్పత్తి విలువ ఎంతో తెలుసా?

- Advertisment -
- Advertisment -

దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి (Domestic Defense Products)లో భారత్ చారిత్రక ఘనత(Indian Historical Record) సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ (Whole Defense Products Value) రూ.1,50,590 కోట్లకు చేరి, సరికొత్త రికార్డు(New  సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 18 శాతం వృద్ధి కావడం విశేషం. గత ఐదేళ్లలో ఈ వృద్ధి 90 శాతానికి పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. రక్షణ ఉత్పత్తిలో ఈ అద్భుతమైన వృద్ధికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), రక్షణ రంగ సంస్థలు, అన్ని భాగస్వామ్య పక్షాల కృషి కారణమని మంత్రి ప్రశంసించారు. ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ, దేశం ఆత్మనిర్భరత వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. మొత్తం ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 77 శాతం కాగా, ప్రైవేట్ రంగం 33 శాతం వాటాను కలిగి ఉంది. ఈ గణాంకాలు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, స్వదేశీ అవసరాలను తీర్చడమే కాకుండా, ఎగుమతి సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంటున్నామని స్పష్టం చేస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -