end
=
Monday, April 29, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Education Distruction : విద్య పేరుతో వినాశనం!
- Advertisment -

Education Distruction : విద్య పేరుతో వినాశనం!

- Advertisment -
- Advertisment -
  • మెథడ్, మెథడ్స్(Methods) అంటూ ఇరికించి పెట్టారు
  • పిల్లోడ్ని, టీచర్ ని, పేరెంట్ ని
  • స్కిల్స్, స్కిల్స్ అంటూ కండీషన్ చేసేశారు.
  • అనుభూతి(Experience), హార్ట్ తో లయం కావడం పూర్తిగా పోయింది.
  • జీవిగా, క్రిమికీటకంగా మార్చేశారు
  • మొత్తం హ్యుమానిటీని(Humanity) ఎంత సంకుచితం చేసిపడేశారు!
  • ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త శివరామ్(Shivaram)

Education Distruction : “గొప్ప ఎడ్యుకేషనిస్టులు… మాంటిస్సోరీ(Montessori) తర్వాత ప్రముఖ స్పానిష్ ఎడ్యుకేషనిస్ట్ పియాజీ (Spanish educationist Piaggio) చాలా ఫేమస్. వీళ్లంతా ఏంచేశారు? మెథడ్, మెథడ్స్ అంటూ కనిపెట్టి ఆ మెథడ్స్ లో ఇరికించి పెట్టారు పిల్లోడిని(Students), టీచర్ ని(Teachers), పేరెంట్(Parents)ని. అంతేగాని టోటల్ గా ఒకదాన్ని ఎట్లా ఫీల్ కావడం, టోటల్ గా ఒకదాన్ని ఎట్లా అనుభూతిలోకి తీసుకోవడం అనేది కంప్లీట్ గా పోయింది. కాగ్నిటివ్ స్కిల్స్ (Cognitive Skills) అని, అదని, ఇదని ఎంత మాట్లాడినా అదంతా లిమిటెడ్ గా తీసుకుపోయి ఒక బొరియలో పెట్టినట్లు పిల్లలను కండిషన్ చేసుకుంటూ పోయారు” అని ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త శివరామ్ అన్నారు. ఆదివారం విజయవాడ(Vijayawada) సమీపంలోని పాతూరు వద్ద కృష్ణానదీ తీరాన అరవింద స్కూల్ ఇంద్రాణి గారి నూతన గృహపవ్రేశం సందర్భంగా జెకె స్టడీ సెంటర్ (JK Study Center) ఆధ్వర్యంలో ‘డైలాగ్’ కార్యక్రమం జరిగింది. యథాతథంగా శివరామ్ గారిమాటల పవ్రాహం ఇది.

‘ఎడ్యు కేషన్ లో ముఖ్యంగా నేర్చుకోవడంలో అటెన్షన్ (Attention) చాలా ముఖ్యం. అటెన్షన్ అంటే ‘ఆల్ యువర్ సెన్సెస్ బి అటెంటివ్'(all your senses be attentive) అని. అన్ని పంచేంద్రియాలు ఒకటి కావడం. ఒక సెన్స్(Sense) పనిచేయడంలో నేర్చుకోవడం కూడా చాలా పరిమితమైపోతుంది. కండిషన్ అవుతుంది. అట్లా కాకుండా టోటల్ సెన్సెస్ ఒకటికావడం అనేది. ఇది పిల్లలకు పట్టించడం జరిగితే ఎడ్యు కేషన్ (Education) చాలా సులభం అవుతుంది. ఏ సబ్జెక్ట్ అయినా అలవోకగా(Easy), నీలాజాలంగా, హాయిగా నేర్చుకుంటారు. అది మనం పట్టించలేకపోతున్నాం. అది ఇది అంటూ.. ఎక్కడికక్కడ డివిజన్.. ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అంటాం. ఉండేదంతా లెర్నింగ్ లో ఒకటే సబ్జెక్ట్. దటీజ్ లైఫ్. దటీజ్ యువర్ మైండ్. మైండ్, లైఫ్ ఒకటే సబ్జెక్ట్. దాన్ని గమనించడం అనేది మనం నేర్పిస్తున్నామా? అంటే హయ్యెస్ట్ అటెన్షన్ టోటల్ గా. మనల్ని ప్రతిదీ కూడా లిమిట్ చేస్తుంది. ఒక మ్యుజీషియన్ (Musician)ఉంటాడు. ఆ మ్యుజీషియన్ కే ఆ చెవి తీవ్రం దానికే కండిషన్ అయి ఉంటుంది. చిత్రకారుడు(Artist) ఉంటాడు. ఆ రంగుకు, ఆ గమనిక, ఆ లిమిటేషన్ లోనే మైండ్ ఫంక్షన్ అవుతుంటుంది. సైంటిస్ట్ (Scientist) ఉంటాడు. సైన్స్ కి సంబంధించి డార్విన్(Darwin) అంటాడు. “డిసెక్షన్ మొదలయ్యాక నన్ను నేను గమనించుకుంటే ఒక సౌందర్యం అంటే ఏంటి? ఈస్తటిక్ సెన్స్( Aesthetic Sense) ఏమిటి? దాన్ని గమనించే విధానం ఏంటి? మొత్తంగా కోల్పోయాను. ఎందుకంటే డిసెక్షన్ అనేదినన్ను అంత లిమిటెడ్ గా మార్చేసింది. హార్ట్ అనేది కంప్లీట్ గా నెగ్లెక్ట్ అయిపోయింది. సౌందర్యం, అనుభూతి, ఫీలింగ్ అనేదిలేకుండా పోయింది. ఇది పెద్ద రోగం నాలో” అంటాడు డార్విన్.

Shivaram

ఎక్కువ అనాలసిస్ (Analysis)… ఇవన్నీ వచ్చినప్పుడు పిల్లలు టోటల్ గా మొత్తంగా మిస్ అవుతున్నారు. ‘అన్ని ఇంద్రియాలు ఒకటిగా ఫంక్షన్ కావడమే మెడిటేషన్ (Meditation)’ అంటారు కృష్ణమూర్తి (Jiddu Krishnamurthy). చూడటం, ఎట్ ది సేమ్ టైం వినడం. ఇంద్రియాలు అన్నీ కూడా కంప్లీట్ గా ఫంక్షన్ లో ఉండడం. ఇది స్టూడెంట్ కి, టీచర్లకి ఎట్లా పట్టించాలి? ఎట్లా అర్థం కావాలి? అంటే ఒక మౌనం.. ఇక్కడ ఏ కృష్ణా రివర్ నో, ఆకాశాన్నో చూస్తున్నపుడు, లేకపోతే పక్షి పాటలను ఏదో వింటున్నప్పుడు, ఇప్పుడే జముడు కాకి అదిగో (కూ..కూ అని శివరామ్ గారే ఆ శబ్దం చేస్తూ) వింటున్నప్పుడు టోటల్ ఇంద్రియాలతో వింటున్నపుడు.. ఏంటి మైండ్ ఫంక్షన్ (Mind Functionality).. అని మీరు చూడండి. అది టోటల్ సైలెన్స్ (Silence). ఆ సైలెన్స్ లో ఆలోచన ఉండదని కాదు. ఆలోచనను ఉపయోగించుకోవడం ఉంటుంది. భాషను ఉపయోగించుకోవడం ఉంటుంది. అయితే అంతకంటే టొటాలిటీ(Totality) నుంచి ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి. టొటాలిటీ నుంచి ఇవి ఉపయోగించుకోవడం ఒక విధం. అట్లా కాకుండా క్యాటు, ర్యాటు, మ్యాట్ అంటూ పిల్లలకు నేర్పించి ఆ పదాల ద్వారా ప్రతిదీ గమనించడం అనేది.. ఎంత ప్రమాదం జరిగిందంటే ఎడ్యుకేషన్ లో… ఒక్కొక్కరు ఇచ్చిన అవార్డు.. అది చాలా అతిపెద్ద విప్లవం అని, కాగ్నిటివ్ స్కిల్స్(Cognitive Skills) అని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. పముఖ స్పానిష్(Spanish) ఎడ్యుకేషనిస్ట్ పియాజి అంటారు కాగ్నిటివ్ స్కిల్స్ అని.. పియాజి.. ఇట్లాంటి వారు కాగ్నిటివ్ స్కిల్స్ అని ఎంత మాట్లాడినా అదంతా లిమిటెడ్ గా తీసుకుపోయి ఒక బొరియలో పెట్టినట్లు పిల్లలను కండిషన్ చేసుకుంటూ పోయారేకాని అమాయకంగా పిల్లోడు ఇట్లా చూసి, ఆకాశాన్ని చూసి, చందమామను చూసి హాయిగా.. ఇట్లా టోటల్ గా ఫీలింగ్ తో, హార్ట్ తో లయం కావడం.. అదంతా పోయింది కదా టోటల్ గా. ఎడ్యు కేషన్ నాశనం అయిపోయింది కదా. దానిగురించి ఎవరూ పట్టించుకోవడం లేదు కదా. టోటల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా తీసుకపోయి బొక్కలో పెట్టేస్తున్నారు. చిన్న.. అంతేగాని టోటల్ గా అన్ని ఇంద్రియాలు (Senses) అటెన్షన్ (Attension)లోకి రావడానికి… వీళ్లంతా గొప్ప ఎడ్యుకేషనిస్టులు.

మాంటిస్సోరీ(Montessori) తర్వాత పియాజీ(Piagy) చాలా ఫేమస్. వీళ్లంతా ఏం చేశారు? మెథడ్, మెథడ్స్, మెథడ్స్ కనిపెట్టి ఆ మెథడ్స్ లో ఇరికించి పెట్టారు పిల్లోడిని, టీచర్ ని, పేరెంట్ ని. అంతేగాని టోటల్ గా ఒకదాన్ని ఎట్లా ఫీల్ కావడం, టోటల్ గా ఒకదాన్ని ఎట్లా అనుభూతిలోకి తీసుకోవడం.. దానికి ఇట్లా ప్లేసులు ఎంత అవసరం అవుతాయంటారు. ఇట్లా కూర్చుని ఇంత సీరియస్ విషయాలను, ఇట్లాంటివి మనం వేరే అవకాశాల్లో, వేరే అట్మాస్ఫియర్ లో కనీసం డిస్కస్ చేయడానికి అయినా వీలుంటుంది అంటారా? లేకపోతే ఇట్లా ప్లేస్ లో వున్నాం కాబట్టి ఇట్లా మనం కొన్నయినా టచ్ చేయగలుగుతున్నామంటారా? అనుభూతి(Experience) అంటే కేవలం మాటలు కాదు. అనుభూతి అంటే ఒక నిండు.. కంప్లీట్ గా.. దాన్నే కృష్ణమూర్తి ఎప్పుడూ ఇంటెలిజెన్స్(Intelligence) అంటారు. ‘డు యు నో ది డిఫరెన్స్ బిట్వీన్ వాటీజ్ ఇంటెలిజెన్స్ అండ్ వాటీజ్ ఇంటలెక్ట్’ అంటారు. ఇంటలిజెంట్ అంటే మైండ్. ఎడ్యుకేషన్ టోటల్ గా.. మీరు చూడండి.. ఇటీజ్ డెవలపింగ్ ఆల్ ది టైం ఇంటలెక్ట్… ఇంటలెక్ట్.. మనం బుద్ధిజీవులం. భౌతికంగా మేధోజీవులం. మరి ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఇంటెలిజెన్స్ అంటే దాని రూట్ మీనింగ్ లో కృష్ణమూర్తి చెబుతారు. ఇంటలిజెంట్ మీన్స్… ద రూట్ మీనింగ్.. రీడ్ బిట్వీన్ ద లైన్స్.

మన చదువంతా లైన్స్ లో ఉందే కానీ బిట్వీన్ ద లైన్స్ లో లేదు. వి హావ్ మిస్డ్ ది స్పేస్ బిట్వీన్ ది లైన్స్. మరి ఎక్కడ ఉంటది అంటే, ఇట్లా చూసుకుంటా కూర్చుంటే.. సైలెన్స్ లో. ఆ బిట్వీన్ ద లైన్స్ పట్టించాలా టీచర్ కైనా, స్టూడెంట్ కైనా, పేరెంటుకైనా అంటే డెఫినెట్ గా ఊరికే కూర్చోవాలి. కార్తీక మాసం… ఇట్లాంటివన్నీ ఏదో గాసిప్ గా గడపటానికి కాదు. ఇట్లా ఇన్ సైట్స్ కోసం ఎడ్యుకేషన్ ప్లేస్ (Education Place) గా మార్చాలి. ఇటువంటి ప్లేసులు ఏర్పడడం, అవకాశాలు ఏర్పడడం, అనుభూతితో అందరూ స్పందించడం.. కలిసి స్పందించడం. అంతేగాని పియాజి చెప్పే కాగ్నిటివ్ స్కిల్స్ (Cognitive Skills) కి లిమిట్ కావడం కాదు. అవసరమా, అనవసరమా అని కాదు.. మొత్తం హ్యుమానిటీని ఎంత సంకుచితం చేసిపడేశారో. అనంతమైన అనుభూతిలో, అనంతమైన సైలెన్స్ లో, అనంతమైన శక్తి (Infinite Power) ప్రవాహంలో అద్భుతంగా ఇదికావడం మానేసి ఎంత పిదపజీవిగా అయిపోయి, ఒక క్రిమికీటకంగా(Insects) మార్చేశారు. ఎడ్యు కేషన్ అంటే మనల్ని క్రిమికీటకాలుగా మార్చేసింది. ఇది పెద్ద చాలెంజ్, దీన్ని ఎదుర్కోవడం అనేది.

మళ్లా సైలెన్స్ లోకి పిల్లల్ని తీసుకువస్తున్నారు. టీచర్స్, పేరెంట్స్ ఆ సైలెన్స్ ఫీల్ కాగలుగుతారా? ఆ డీప్ సైలెన్స్ (Deep Silence)అన్నీ నేర్పిస్తుంది. ఏకాంతం(Solitude)లో ఒంటరితనం ఉండదు. ఏకాంతంలో తనంతట తాను ఉన్నా కూడా సమస్తముతో ఏకంగా స్పందించే స్థితి ఏకాంతం. అట్లా కాకుండా తనంతట తాను డివైడ్ చేసుకుని సపరేట్ గా బతికే ఏకాకి బతుకు.. అది చాలా దుఃఖభూయిష్టం. దీన్ని lonely feeling అంటారు. ఏ కొందరు దీన్ని అర్థం చేసుకున్నా అది human consciousness మీద తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ కాదు. టోటల్ లైఫ్ ఎఫెక్ట్ కావాలి. మన ఎడ్యుకేషన్(Eduction) అంతా కూడా కేవలం ఇన్ఫర్మేషన్ కోసం కలెక్ట్ చేసుకుంటున్నారు. రొటీన్ బ్రేక్ చేయడము అంటే నిజంగా జీవితంలో ఒక గొప్ప సవాల్.. రొటీన్ బ్రేక్ చేయడం చాలా అవసరం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -