end
=
Wednesday, May 15, 2024
వార్తలురాష్ట్రీయంKamareddy Bandh:కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు
- Advertisment -

Kamareddy Bandh:కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు

- Advertisment -
- Advertisment -
  • మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు (Formers). మాస్టర్ ప్లాన్ (Master plan)పేరుతో తమ భూముల్ని కబళిస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అందులోభాగంగానే శుక్రవారం కామారెడ్డి టోటల్‌ బంద్‌ (Bhand)కు పిలుపునిచ్చారు. కామారెడ్డి మున్సిపాల్టీ మాస్టర్ ప్లాన్‌ మంటలు పుట్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోబోమంటూ నిన్నంతా ఆందోళన చేసిన రైతులు బంద్‌కి పిలుపునివ్వగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామనగా కామారెడ్డి బంద్‌తో మరింత టెన్షన్ పెరింగింది. చేతిలో ఉన్న అరెకరం ఆగమాగమైతే.. మాస్టర్‌ ప్లానొచ్చి కాకులెత్తుకుపోతే మేమేం తినాలె ఏడకు పోవాలె.. అంటూ రోడ్డెక్కేశాడు కామారెడ్డి అన్నదాత. మీ మాస్టర్ ప్లాన్లు మీ దగ్గరే ఉంచుకోండి.. మా పొలం మాకిచ్చెయ్యండని నినదిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ (Telangana govt)ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ విస్తరణ-అభివృద్ధి కోసం ఇటీవలే మాస్టర్‌ ప్లాన్ సిద్ధమైంది. మాస్టర్ ప్లాన్ ఏ ముందంటే.. ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్లు (Zone, Green Zone, Commercial Zone, Residential Zones) మొత్తం 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం విలీన గ్రామాలు అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లి కూడా ఇంక్లూడింగ్ కామారెడ్డి (Adlur, Tekiryal, Kalsipur, Gudupalli, Lingapur, Surampalli, Patharajampet, Rameswaram Palli also including Kamareddy)ని నాలుగు భాగాలుగా చీల్చి ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో గీయించి పెట్టిన ఈ మాస్టర్ ప్లాన్.. పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతోంది. రైతాంగం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇండస్ట్రియల్ జోన్ ప్రతిపాదించడం. రద్దీగా ఉండే రహదారుల వెడల్పు తగ్గించడం.. ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊతమిచ్చేవే అనేదై కామారెడ్డి రైతుల ఆరోపణ.

కామారెడ్డి ఇండస్ట్రియల్‌ జోన్‌ పరిధిలోకొచ్చే 1200 ఎకరాల్లో 900 ఎకరాలు అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ రైతులకు చెందినవే. పరిశ్రమలంటే దాని వెంబడే పొల్యూషనూ గట్రా అన్నీ వచ్చేస్తాయి. అకస్మాత్తుగా తమ భూములకు డిమాండ్ పడిపోవడంతో లబోదిబోమంటూ ఆందోళన బాట పట్టారు కామారెడ్డి రైతులు. 8 గ్రామాల మీదుగా ప్లాన్ చేసిన హండ్రెడ్ ఫీట్‌ రోడ్డు కూడా.. ఆ గ్రామాల్లో రైతుల్ని అలర్ట్ చేసింది. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు పోగొట్టుకుంటామన్నది వీళ్ల భయం. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన మొదలైంది.

మాస్టర్‌ప్లాన్‌లో తన భూమి పోతుందనే ఆవేదనతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన మరింత మంటపుట్టింది. చావో రేవో అంటూ మొన్న మున్సిపాలిటీని ముట్టడించారు. గురువారం కుటుంబాల్ని వెంటబెట్టుకుని కలెక్టరేట్ ముట్టడికి తెగించారు. ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుంటూ కలెక్టరేట్‌ లోపలికి దూసుకెళ్లారు. గేటుకు వేసిన తాళం తొలగించారు. తోపులాటలో పోలీసులక్కూడా గాయాలయ్యాయి. నోటి కాడ అన్నాన్ని లాగేసుకుంటున్నారంటూ భగ్గుమన్నాడు కామారెడ్డి రైతన్నలు. ఏడాదికి రెండు పంటలు పండే భూముల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్ ప్లాన్ కోసం బలిచ్చేది లేదని పట్టుమీదున్నాడు ఇక్కడి అన్నదాత.

అలాగే కామారెడ్డిలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీసింది. నేడు కామారెడ్డి బంద్‌కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. నిన్న కలెక్టరేట్‌ వద్ద జరిగిన రైతుల ఆందోళనతో ముందస్తుగా రైతు జేఏసీ, బీజేపీ ముఖ్య నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మూర్ఖ వైఖరికి ఒక రైతు బలికావడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి కి చెందిన రైతు పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదు అది ప్రభుత్వహత్య అని పేర్కొన్న బండి సంజయ్ నిన్న రైతు మృతదేహం తరలింపు విషయంలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు.

అయితే దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్(BJP chief Bandi Sanjay) భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యతంటూ కలెక్టర్, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా అధికార యంత్రాంగం భావించకూడదని ఆయన గుర్తు చేశారు. అధికారులు చట్టబద్దంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.

అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఉగ్రవాదులుగా, సంఘ విద్రోహ శక్తులుగా పరిగణిస్తోంది అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బారికేడ్లు, కంచె వేసి రైతులను అడ్డుకోవడం సిగ్గుచేటని, పట్టణానికి మాస్టర్ ప్లాన్ అవసరం అనుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ భూములను, బీడుబడిన భూములను సేకరించాలి కానీ చక్కగా పంటలు పండే రైతులు వ్యవసాయ భూములు లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం ఎవరినీ కలిసే తీరిక లేదని, కనీసం జిల్లా కలెక్టర్లకు కూడా రైతులకు కలిసి తీరిక లేకుండా పోయిందని కామారెడ్డి కలెక్టర్ తీరును బండి సంజయ్ ఎండగట్టారు. ఇప్పటికైనా వెంటనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు, రాష్ట్ర మంత్రులు రైతులతో చర్చలు జరగాలన్నారు. రైతులు సూచించిన మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాలని ఆయన పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ మార్చకుండా ఇలానే మూర్ఖంగా ముందుకు వెళితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఉపసంహరించుకోవాలని రైతులు చేపట్టే ఆందోళనకు బిజెపి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

(Khammam:రూ.250 కోట్లతో ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -