భారత అంతరిక్ష పరిశోధన రంగం (Indian Space Research Wing) మరో మైలురాయిని దాటింది. యాక్సియం మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Indian Aaustonaut Shubhansu) తన బృందంతో కలిసి రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) (International Space Station) అడుగుపెట్టడం యావత్ భారతదేశానికి గర్వకారణమైంది.
గురువారం సాయంత్రం బృందం ప్రయాణిస్తున్న యాక్సియం మిషన్ అంతరిక్షంలోని ఐఎస్‌ఎస్‌తో డాకింగ్ అనుసంధానమైంది. స్పేస్ షిప్ (Space Ship) భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ.. గంటకు 17వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఐఎస్‌ఎస్‌తో కలిసింది. శుభాంశు ఐఎస్ఎస్కు చేరుకున్న తర్వాత తన అనుభవాలను పంచుకున్నారు. ‘అంతరిక్ష కేంద్రం కొత్తగా ఉంది. ఇక్కడ గురుత్వాకర్షణ లేదు.
నేనిప్పుడు గాలిలో తేలియాడుతున్నా. నా తల మాత్రం చాలా బరువుగా అనిపిస్తోంది. మా బృందం ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టగానే లోపలి వ్యోమగాములు మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. మేం ఇక్కడ రెండు వారాలపాటు ఉంటాం’ అని ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
1984లో మరో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా నిలిచినప్పటికీ, అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లి సరికొత్త రికార్డు నెలకొల్పారు.