రాజకీయ దురుద్దేశంతో నివేదికలు
మాజీ మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బీఆర్ఎస్ నేతల (Brs Leaders)పై రాజకీయ కక్ష సాధింపులకు (Faction-building measures) పాల్పడుతున్నదని, రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరంపై నివేదిక(Kaleswaram Record) సిద్ధం చేయించారని మాజీ మంత్రి (Ex Mla), బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Pressentation)లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక, రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు రెండుసార్లు కూలిపోయినా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇవ్వలేదని, కానీ మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిన వెంటనే ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చిందని దుయ్యబట్టారు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో పూర్తిగా ఆధారాలు లేవని, రాజకీయ దురుద్దేశంతో రూపొందించిందని ఆరోపించారు. కన్నేపల్లి పంపుహౌస్ ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని, తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై గోబెల్స్ ప్రచారం చేస్తోందని, తప్పుడు సమాచారం ఇస్తోందని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవని, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీవీల్లో వచ్చే సీరియల్స్‌లా సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో అంశంపైన రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, సీఎం ముందు వాటిని పరిష్కరించాలని సూచించారు.