end
=
Tuesday, August 12, 2025
వార్తలురాష్ట్రీయంరైతుబీమా దరఖాస్తులు.. బిగ్​ అలర్ట్
- Advertisment -

రైతుబీమా దరఖాస్తులు.. బిగ్​ అలర్ట్

- Advertisment -
- Advertisment -

తెలంగాణ ప్రభుత్వం (TG Govt) అమలు చేస్తున్న రైతు బీమా(Raitu Beema) పథకానికి సంబంధించిన దరఖాస్తులకు ఆగస్టు 13 చివరి గడువు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14 నుంచి మరుసటి ఏడాది ఆగస్టు 13 వరకు ఈ బీమా అమలులో ఉంటుంది. ఈ పథకం కింద నమోదైన రైతు ఒకవేళ చనిపోతే, ఆయన నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం (Insurance Money) అందుతుంది.

పథకానికి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు(New Pass Book Holders) కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, వారు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్‌లను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలి. (Have to submit to AEOs) ఆ తర్వాత ఏఈవో వ్యవసాయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తమ యూజర్ ఐడీతో లాగిన్ అయి రైతు వివరాలను నమోదు చేస్తారు.

పథకంలో రైతుల తరఫున ఎల్‌ఐసీ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు మరణం తర్వాత, రెండు మూడు రోజుల్లోపే సంబంధిత సర్టిఫికేట్లను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 10 రోజుల్లోపే నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి. పథకం 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉండే రైతులకే వర్తిస్తుంది. గడువులోగా దరఖాస్తు చేసుకోకపోతే, ఈ ఏడాది బీమా వర్తించదని అధికారులు చెప్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -