end
=
Monday, June 30, 2025
వార్తలురాష్ట్రీయండాక్టర్​ మనోజ్​రెడ్డికి సత్కారం
- Advertisment -

డాక్టర్​ మనోజ్​రెడ్డికి సత్కారం

- Advertisment -
- Advertisment -

ప్రభుత్వ వైద్యరంగం (Govt health care)లో పేదలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్న ముషీరాబాద్​ అర్బన్​ ప్రభుత్వ వైద్యాశాల (Mushirabad Medical Officer)మెడికల్​ ఆఫీసర్ డాక్టర్​ మనోజ్​రెడ్డి (Doctor Manoj Reddy)ని ఐఏఎస్​ అనుదీప్​ దురిశెట్టి (IAS Anusetti Anudeep) సత్కరించారు. అత్యుత్తమ వైద్య సేవలు (The Best Performer) అందిస్తున్నమనోజ్‌ రెడ్డి నాలుగు సార్లు “ఉత్తమ వైద్యాధికారి అవార్డు” అందుకుని విశేష గౌరవం పొందారు.

ఆయనకు నిమ్స్‌ సహా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ పురస్కారాలు లభించాయి. 2017 జనవరి 26న నిమ్స్‌ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ వైద్యాధికారి అవార్డు అందుకున్నారు. ఆ తరువాత 2021-22 సంవత్సరానికి గాను 2022 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరోసారి ఉత్తమ వైద్యాధికారి అవార్డు లభించింది. 2023 జూన్‌ 14న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో

ఆయన సేవలను గుర్తించి మూడోసారి ఉత్తమ వైద్యాధికారి అవార్డును అందించారు. తాజాగా 2024 జనవరి 26న హైదరాబాద్‌ కలెక్టర్‌ చేతుల మీదుగా నాలుగోసారి ఉత్తమ వైద్యాధికారి అవార్డు అందుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆయన చేస్తున్న కృషికి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఆయన మరింత మందికి వైద్య సహాయం అందించాలని కోరారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -