end
=
Monday, January 26, 2026
వార్తలుఅంతర్జాతీయంవిదేశీ విద్యార్థులకు శుభవార్త..అమెరికా ఎఫ్–1 వీసాలకు భారీ మార్పులు
- Advertisment -

విదేశీ విద్యార్థులకు శుభవార్త..అమెరికా ఎఫ్–1 వీసాలకు భారీ మార్పులు

- Advertisment -
- Advertisment -

F1 Visa: ఉన్నత విద్య (higher education) కోసం అమెరికా (America)ప్రయాణం చేయాలనుకుంటున్న భారతీయులతో పాటు విదేశీ విద్యార్థులందరికీ శుభవార్త చెప్పేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. విద్యార్థి వీసాల (Student Visa)జారీ ప్రక్రియలో కీలక సంస్కరణలు చేస్తూ, ఎఫ్–1 వీసాపై (F1 Visa) ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ఇంటెంట్ టు లీవ్’ నిబంధనను రద్దు చేసే దిశగా అమెరికా శాసనసభ్యులు ముందడుగు వేశారు. ఇందుకోసం డిగ్నిటీ యాక్ట్–2025 పేరుతో కొత్త బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, ఇకపై విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక స్వదేశానికి తప్పనిసరిగా తిరిగి వెళ్తామని కాన్సులర్ అధికారులను నమ్మబెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఎఫ్–1 వీసా దరఖాస్తుల తిరస్కరణల్లో పెద్ద భాగం ఈ ‘ఇంటెంట్ టు లీవ్’ నిబంధన కారణంగానే జరుగుతోంది. విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తిచేసుకున్న తర్వాత వెంటనే స్వదేశానికి వెళ్తారని నిరూపించేందుకు స్వదేశంలో తమకు ఉన్న ఆస్తులు, ఉద్యోగ అవకాశాల పత్రాలు చూపాల్సి వస్తోంది.

చాలా మందికి ఈ ప్రమాణాలు అమలు చేయడం కష్టమై, వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఏడాది ఎఫ్–1 వీసాల జారీ గణనీయంగా తగ్గిపోగా, తిరస్కరించిన దరఖాస్తులలో ఎక్కువశాతం ‘ఇంటెంట్ టు లీవ్’ను నిరూపించలేకపోవడమే ప్రధాన కారణంగా బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత డిగ్నిటీ యాక్ట్ అమల్లోకి వస్తే, ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ‘చదువు పూర్తయిన తర్వాత అమెరికా విడిచిపోతావా?’ అనే ప్రశ్నను పరిగణనలోకి తీసుకోకుండా వీసాలు జారీ చేస్తే, అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ మార్పులు ప్రస్తుతం బిల్లు దశలోనే ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్‌ ఉభయసభలు ఆమోదించి, అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాతే ఈ నిబంధనలు అధికారికంగా అమల్లోకి వస్తాయి.

ఇదిలా ఉండగా, మరో కీలక మార్పు దిశగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) కూడా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఎఫ్–1 వీసాలతో విద్యార్థులు తమ చదువు వ్యవధి మేరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అయితే DHS ప్రతిపాదన ప్రకారం, భవిష్యత్తులో ఈ ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ నిబంధనను రద్దు చేసి, బదులుగా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను ఇవ్వాలన్న ఆలోచన వ్యక్తమైంది. అంటే ఎంతకాలం చదవాలనుకున్నా, నిర్దిష్టంగా అనుమతించిన కాలం అనంతరం మళ్లీ అనుమతి పొంది ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రధాన మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో చదవాలనుకునే లక్షలాది విదేశీ విద్యార్థులకు కొత్త అవకాశాలు తెరవబోతున్నాయి.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -