end
=
Tuesday, July 15, 2025
వార్తలురాష్ట్రీయంమలక్​పేటలో గన్​ ఫైరింగ్​
- Advertisment -

మలక్​పేటలో గన్​ ఫైరింగ్​

- Advertisment -
- Advertisment -

సీపీఐ నేత చందునాయక్​పై దుండగుల కాల్పులు
తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి

హైదరాబాద్‌లోని మలక్‌పేట(Hyderabad Malakpet Area)లో దుండగుల కాల్పులు (Goons Gun Firing) కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్‌లోని పార్క్‌ వద్దకు మంగళవారం ఉదయం కొందరు దుండగులు కారులో వచ్చారు. అక్కడ చందునాయక్‌(43) (Victim Chandu Nayak)అనే సీపీఐ నేత (CPI Leader) తన భార్య, పిల్లలతో కలిసి వాకింగ్​ చేస్తుండగా అతడి కళ్లలో కారం కొట్టారు. అనంతరం తుపాకులతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.

అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చందూనాయక్‌ అక్కడికక్కడే మరణించాడు (Spot dead). సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పార్క్‌లో వాకింగ్‌ చేసుకుంటుండగా ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి వాకర్స్​ పరుగులు పెట్టారు. సౌత్​ ఈస్ట్​ డీసీపీ చైతన్యకుమార్​ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు.

మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. దేవరుప్పలకు చెందిన సీపీఐ (ఎంఎల్‌) నాయకుడు రాజేశ్‌పై ఆమె అనుమానం వ్యక్తం చేశారని వెల్లడించారు. భూ తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడు చందూనాయక్‌ స్వస్థలం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి అని పోలీసులు తెలిపారు.

ఆయన గతంలో సీపీఐ ఎంల్​ పార్టీ నుంచి సీపీఐలో చేరారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2022లో ఎల్బీనగర్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో చందూనాయక్​ నిందితుడిగా ఉన్నారు. మరో వైపు కాల్పులు జరిపిన రాజేశ్‌, సుధాకర్‌ మరో ఇద్దరు నిందితులు ఎస్‌వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -