end
=
Tuesday, July 15, 2025
సినీమా‘హరిహర వీర మల్లు’ సినిమా నిడివి ఎంతంటే?
- Advertisment -

‘హరిహర వీర మల్లు’ సినిమా నిడివి ఎంతంటే?

- Advertisment -
- Advertisment -

పవర్‌ స్టార్‌ (Power Star) పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan)ఈ మాటే చాలు.. ఫ్యాన్స్‌లో ఆయనకుండే క్రేజ్​ వేరే లెవల్ (Fans about Crazy)​. ఆయన ఒక పోరాట యోధుడిగా నటిస్తున్న సినిమా ‘హరి హర వీర మల్లు’(Hari Hara Veera Mallu). చిత్రం కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. 17వ శతాబ్దపు మొఘల్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యోధుడిగా తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించిన వీరమల్లు గాథను

‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’లో (Ready To Release) చూపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్​డేట్​ ఇప్పుడు బయటకు వచ్చింది. చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలని మేకర్స్​ అఫిషియల్​గా ప్రకటించారు. చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకులు. ఈ పీరియాడిక్​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా,

నిధి అగర్వాల్‌, నర్గీస్‌ ఫఖ్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్స్‌పై ఏ దయాకర్‌రావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -