end
=
Friday, July 18, 2025
సినీమా‘వీరమల్లు’తో వీరోచిత ప్రయాణం !
- Advertisment -

‘వీరమల్లు’తో వీరోచిత ప్రయాణం !

- Advertisment -
- Advertisment -

పవర్​ స్టార్ ​(Power Star) పవన్​ కల్యాణ్ (Pawan Kalyan)​ నటిస్తున్నచిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu). నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నఈ చారిత్రక చిత్రం (Periodic Film)ఈనెల 24న విడుదల కానున్నది. చిత్రంలో నాయికగా (Actess)నిధి అగర్వాల్ (Nidi Agarwal), ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్నారు.

వారం రోజుల్లో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సినిమా బృందం ప్రచారంలో వేగం పెంచింది. ప్రచారంలో భాగంగా తాజాగా అందాల బ్యూటీ నిధి అగర్వాల్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘పవన్‌కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తున్నారు. ‘ఇండియా జోన్స్​’ సిరీస్​ చిత్రాలకు ఇది ఇండియన్ వెర్షన్. దర్శకుడు క్రిష్ నా పాత్రను చాలా ఆసక్తికరంగా మలిచారు.

నా పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్‌కు, నాకు మధ్య సన్నివేశాలు బాగా పండాయి. భరతనాట్యం నేపథ్యంలో తీసిన సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్‌కల్యాణ్‌తో ఒక్క సినిమా చేసినా ఒకటే. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. తెలుగు సాహిత్యం ఎక్కువగా చదువుతారు. ఆయనకు ఎంతో తెలుసు. అలాగే జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం కూడా సినిమాకు కలిసి వచ్చింది.

ఆయన సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సంగీత దర్శకుడు కీరవాణి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు’ అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -