తాను గేమింగ్ యాప్ (Gaming App)నే ప్రమోట్ (Just Promoted) చేశానని, గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్ (Betting App)కు తేడా ఉందని సినీ నటుడు (Cine Star) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం (ED Office)లో విచారణకు హాజరయ్యారు.
అధికారులు ఆయన్ను సుమారు నాలుగున్నర గంటల పాటు విచారించారు. విచారణ తర్వాత విజయ్ దేవర కొండ మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు వచ్చిన మాట వాస్తవమేనని, యాప్స్‌లో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్. అనే రెండు రకాలు ఉన్నాయని తెలిపారు. తాను ఏ 23 అనే గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేశానని ఈడీకి స్పష్టం చేశానన్నారు. బెట్టింగ్ యాప్స్ కు గేమింగ్ యాప్స్‌కి ఏమాత్రం సంబంధం లేదన్నారు.
గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో లీగల్ అని, గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయన్నారు. తన బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ ఈడీకి సమర్పించానని, తాను ప్రమోట్ చేసిన యాప్ తెలంగాణలో పనిచేయదన్నారు. తాను లీగల్ అనుమతులు ఉన్న యాప్ నే ప్రమోట్ చేశానని వెల్లడించారు. సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలు సైతం ఈడీకి సమర్పించానని తెలిపారు.