end
=
Thursday, July 31, 2025
వార్తలుజాతీయంఇక ప్రమోట్​ చేయను : ప్రకాశ్‌రాజ్
- Advertisment -

ఇక ప్రమోట్​ చేయను : ప్రకాశ్‌రాజ్

- Advertisment -
- Advertisment -

బెట్టింగ్స్​ యాప్స్​ నమ్మి ఎవరూ మోసపోవద్దు

‘బెట్టింగ్స్ యాప్స్‌ ప్రమోషన్​ (Betting Apps Promotions)తో నాకు పైసా రాలేదు. ప్రమోషన్​ తప్పు. నేను ఇక జీవితంలో బెట్టింగ్​ యాప్స్​కు ప్రచారం చేయను. బెట్టింగ్ యాప్స్‌తో డబ్బు సంపాదించాలని ఎవరూ కోరుకోవద్దు (Don`t Play) అని ప్రముఖ నటుడు (Versatile Actor) ప్రకాశ్​రాజ్ (Prakash Raj)​ తెలిపారు. బెట్టింగ్ యాప్‌ల కేసులో బుధవారం ఆయన హైదరాబాద్​లోని బషీర్​బాగ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) (Enforcement Directorate Office)

కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో భాగంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు (Statement Recorded) చేసుకున్నారు. ప్రధానంగా జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రకాశ్‌రాజ్‌కు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. బెట్టంగ్ యాప్ ప్రమోషన్‌లో భాగంగా ప్రకాశ్‌రాజ్.. ఆయా యాప్స్​ నిర్వాహకుల నుంచి భారీగా నగదు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ కోణంలో ఈడీ ఆయన్ను ఆరా తీసినట్లు సమాచారం. తాను 2016లో జంగిల్ రమ్మీ యాప్ కు ప్రమోషన్​ చేశానని, నిర్వాహకులు ఒక్క పైసా నగదు కూడా రాలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు వచ్చిన నగదును, వారు దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీనిలో భాగంగానే ఐదేళ్లలో ప్రకాశ్​రాజ్​ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -