end
=
Tuesday, December 2, 2025
వార్తలురాష్ట్రీయంఇక పై పైరసీ జోలికెళ్లను.. మారిపోతాను: ఐ బొమ్మ రవి !
- Advertisment -

ఇక పై పైరసీ జోలికెళ్లను.. మారిపోతాను: ఐ బొమ్మ రవి !

- Advertisment -
- Advertisment -

iBomma Ravi: పైరసీ సినిమాల వ్యవహారంలో అరెస్టైన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి (Imandi Ravi)పోలీసుల కస్టడీ(Custody)లో పలు ఊహించని విషయాలను వెల్లడించినట్లు సమాచారం. శుక్రవారం రెండో రోజు విచారణ పూర్తయ్యే వరకు ఉదయం నుంచి మాట్లాడని రవి, మధ్యాహ్నం తర్వాత మాత్రం విచారణాధికారుల ముందు నోరు విప్పాడని తెలుస్తోంది. ప్రత్యేకంగా, తాను విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న కారణంగా చట్టపరమైన చర్యలు పెద్దగా ప్రభావం చూపవని భావించానని, ఆ ధైర్యంతోనే పైరసీ కార్యకలాపాలు కొనసాగించినట్లు అంగీకరించినట్టు సమాచారం. విచారణలో భాగంగా రవి చెప్పిన విషయాలు, ఈ నెట్‌వర్క్ ఎలా పనిచేసేదీ, గత ఆరేళ్లుగా పోలీసుల కళ్లకు ఎలా అందకుండా తప్పించుకున్నాడో వివరించినట్లు తెలుస్తోంది.

తనను ఎవరూ పట్టుకోలేరనే అతి విశ్వాసంతోనే దేశ, విదేశాల్లో ఉన్న తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించానని రవి వెల్లడించినట్టు చెబుతున్నారు. ప్రారంభంలో కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పైరసీలో అడుగుపెట్టానని, అది తప్పు మార్గమని గ్రహించడానికి చాలా ఆలస్యం జరిగిందని విచారణలో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. చేసినది తప్పే. కానీ నేను చేసిన పనికి ఇప్పుడు పెద్ద మూల్యం చెల్లించుకుంటున్నాను. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతాను. ఇకపై ఎలాంటి పైరసీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాను అని రవి పోలీసులకు స్పష్టంగా తెలిపినట్లు తెలుస్తోంది. తన తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశమివ్వాలని కూడా రవి అధికారులను అభ్యర్థించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పోలీసులు ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరించడం వేగవంతం చేస్తూనే ఉన్నారు.

రవి నిర్వహించిన నెట్‌వర్క్‌లో దేశ, విదేశాల్లో పని చేసిన ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలను గుర్తించేందుకు సైబర్ నిపుణులతో కలిసి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వీరి ద్వారా పైరసీ సినిమాలు ఎలా లీక్ చేసి, వెబ్‌సైట్‌లో ఎలా అప్‌లోడ్ చేసేవారో, డబ్బు లావాదేవీలు ఎలా జరిగేవో తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా, ఈ కార్యకలాపాల్లో పాల్గొన్న మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రవి ఇచ్చిన సమాచారంతో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున, కేసు దర్యాప్తు దిశ మరింత వేగం కానుందని అధికారులు చెబుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -