ఐకాన్ స్టార్(Icon star) అల్లు అర్జున్(Alllu Arjun) ధరించిన టీ షర్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో ట్రెండింగ్(Trending photo)లో ఉంది. రామ్ గోపాల్‌వర్మ తీసిన మంచి చిత్రాల్లో ‘అనగనగా ఒకరోజు’ ఒకటి. ఈ చిత్రంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పోషించిన నెల్లూరు పెద్దారెడ్డి పాత్ర ఎంతో ఫేమస్. ఇప్పటికీ బ్రహ్మానందం పాత్రకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా జేడీ చక్రవర్తిని చూసి ‘మిమ్మల్నెక్కడో చూసినట్టుందండి! ’ అనే అనే మీమ్ వెరీ ఫేమస్.
మీమర్లు ఎక్కువగా వాడే టెంప్లేట్లో ఇదీ ఒకటి. అయితే.. ఇదే చిత్రంలో మరో డైలాగ్, మరో సీన్ చాలా ఫెమిలియర్. అదే కారును బ్రహ్మానందం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా పోలీసులు అడ్డంగించి.. ప్రశ్నించే సీన్. కారును స్టైల్‌గా ఆపిన బ్రహ్మానందం.. ‘నేనెవరో తెలుసా..?’ అంటాడు పోలీసులతో.. ‘తెలియదు..’ అని పోలీసుల నుంచి సమాధానం. ‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా..?’ అంటూ బ్రహ్మానందం మరో ప్రశ్న. మళ్లీ తెలియదు అని పోలీసుల జవాబు… ఇక ఇక్కడి నుంచి సన్నివేశం రక్తికట్టి పోలీస్ స్టేషన్లో ముగుస్తుంది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్‌లో అల్రెడీ బ్రహ్మానందం ఫోటోలు ఉంటాయి.
అదిగో.. ఆ ఫొటోలే ఇప్పుడు .. అల్లు అర్జున్ టీ షర్ట్‌పై కనిపించాయన్నమాట. మరి అల్లు అర్జున్ ఆ టీ షర్ట్ ధరించడానికి ఏదైనా కారణం ఉందా? లేదంటే ఇదంటే బ్రహ్మానందం గారి మీద అభిమానమా..? అన్నది తెలియదు గానీ.. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.