end
=
Thursday, July 31, 2025
సినీమానువ్వు లేకపోయుంటే.. అని కల్యాణి ఎవరినందంటే..
- Advertisment -

నువ్వు లేకపోయుంటే.. అని కల్యాణి ఎవరినందంటే..

- Advertisment -
- Advertisment -

తెలుగు చిత్రపరిశ్రమకు ‘హలో’ చిత్రంతో పరిచయమై, ఇప్పుడు తమిళ, మలయాళ భాషల్లో ఫుల్​ బిజీగా ఉన్న కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్, తాజాగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ‘లోకా: చాప్టర్ వన్ చంద్రన్’ సినిమాలో నటిస్తున్నారు. సోమవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘లోకా’ టీజర్‌ను షేర్ చేస్తూ, కళ్యాణి ఒక భావోద్వేగపూరిత పోస్ట్ రాశారు. ఆ పోస్ట్‌లో, దుల్కర్‌కు వ్యక్తిగతంగా సందేశాలు పంపడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి తమ “కలల ప్రపంచం” గ్లింప్స్‌ను పంచుకుంటున్నందున ఈ పోస్ట్ పెడుతున్నానని కళ్యాణి పేర్కొన్నారు. దుల్కర్ తన కలలను నిజం చేసుకోవాలని కోరుకుంటూ, ఐదేళ్లుగా తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాను.. తోడుగా నువ్వుంటావని నాకు తెలుసు” అని ఆమె రాసుకొచ్చారు. సూపర్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ‘లోకా’ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఓనమ్ పండుగ కానుకగా ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్నది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -