ఇండియన్ మైఖేల్ జాక్సన్.. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా ప్రభుదేవా.. బీహార్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్ మాసంలోనే పెళ్లి చేసుకున్నారట. ప్రభుదేవా దంపతులు ప్రస్తుతం చెన్నైలోఉంటున్నట్లు తెలిసింది. గతంలో వెన్నెముక సమస్యతో బాధపడ్డ ప్రభుదేవా.. ఫిజియో థెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలోనే సదరు ఫిజియోథెరపిస్ట్‌తో ప్రభు ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారట. కాగా ఈ వార్తలపై ప్రభుదేవాకు సంబంధించిన వారు మాత్రం స్పందించలేదు.