end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయండిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌
- Advertisment -

డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌

- Advertisment -
- Advertisment -

న్యూ ఢిల్లీ: దేశ రైతులు ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు ఈ మేరకు బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ అమల్లో ఉంటుందని ఆల్‌ ఇండియా కిసాన్ సభ, భారతీయ కిసాన్ యూనియన్ వెల్లడించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబర్ 5న దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను రైతులు దహనం చేసిన విషయం తెలిసిందే. రైతులకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే వరకు తమ పోరు ఆగదని, ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కాగా, గత ఇరవై రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం రాజధాని న్యూఢిల్లీలో ఆందోళనలు తీవ్రతరం చేశాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -