end
=
Monday, April 29, 2024
వార్తలుజాతీయంInfluenza Virus : ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో జర భద్రం
- Advertisment -

Influenza Virus : ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో జర భద్రం

- Advertisment -
- Advertisment -

Influenza Virus : కరోనా వైరస్‌(Covid19) నుండి గట్టెక్కామని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్‌ లాంటి లక్షణాలు కలిగి ఉన్న వన్‌ఫ్లుయెంజా(Influenza) ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తదితర పట్టణాలు, గ్రామాలలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ బారి నుండి బయటపడ్డవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ(Union Health Ministry) కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్‌ఫ్లూయెంజా A సబ్‌టైప్‌ H3N2 వైరస్‌.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది.

(బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 546 పోస్టులు)

వ్యాధి లక్షణాలు

– జ్వరం(Fever), జలుబు(Cold), పొడి దగ్గు(Dry Cough), వాంతులు(Vamtings), వికారం, గొంతునొప్పి(Throat Pain), ఒళ్లునొప్పలు, విరేచనాలు వంటి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ఆరోగ్య అధికారులు తెలిపారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ (Influenza Virus ) నుండి కాపాడుకోవడానికి ఐసీఎంఆర్‌(ICMR) మార్గదర్శకాలను, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

– మాస్క్(Face Mask) ధరించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లక‌పోవ‌డ‌మే మంచింది.
– నోరు, ముక్కును పదే పదే తాకొద్దు.
– తరచూ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.
– జ్వరం, ఒళ్లునొప్పులు ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ మందులు వాడాలి.
– ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అధిక మొత్తంలో ద్రవాలు తీసుకోవాలి.
– దగ్గుతున్నప్పుడు, ముక్కు కారుతున్నప్పుడు మీ ముక్కు, నోటిని కవర్‌ చేసుకోవాలి.
– ఇతరులు లేదా కుటుంబసభ్యులకు దగ్గరగా కూర్చుని ఆహార పదార్థాలను తినకూడదు.
– షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం.. హ‌గ్‌(HUG)చేసుకోవడం వంటివి చేయొద్దు.
– బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం చేయ‌కూడ‌దు.
– యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాలను వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉపయోగించాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -