end
=
Friday, May 17, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Alcohol:ఆల్కహాల్‌తో స్టీమీ సెక్స్‌ సెషన్‌ నిజమేనా? 
- Advertisment -

Alcohol:ఆల్కహాల్‌తో స్టీమీ సెక్స్‌ సెషన్‌ నిజమేనా? 

- Advertisment -
- Advertisment -

ఈ రోజుల్లో పెరుగుతున్న ఒత్తిడి(Stress)ని అధికమించేందుకు మహిళలు (Womens) ఎక్కువగా ఆల్కహాల్ (Alcohol)ఆశ్రయం పొందుతున్నారు.  దీన్ని భావోద్వేగ (Emotional)సమస్యలను ఎదుర్కునే మార్గంగా భావిస్తున్నారు. అంతేకాదు మద్యపానం అనేది స్టీమీ సెక్స్ సెషన్‌ (steamy sex session)కు కిక్ (kick)ఇస్తుందని అనుకుంటున్నారు. కానీ ఆల్కహాల్, సెక్స్ డ్రైవ్ ఎల్లప్పుడూ బెస్ట్ కాక్‌టెయిల్‌ (Best cocktail)ను తయారు చేయలేవని చెప్తున్నారు నిపుణులు. ఈ సమయంలో శృంగారాన్ని ఎక్కువగా అనుభూతి చెందినా కానీ యోని (vagina)పొడిబారడం వల్ల డంపెనర్‌కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (Centers for Disease Control and Prevention) ప్రకారం, స్త్రీల శరీరాలు పురుషుల కంటే భిన్నంగా మద్యాన్ని గ్రహిస్తాయి. వాటి జీవక్రియ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అదే మొత్తంలో డ్రింక్స్ (drinks)తీసుకున్నప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళలు రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను ఎక్కువగా కలిగి ఉంటారని నివేదించబడింది. ఇది ఆల్కహాల్ స్వల్పకాలిక, దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు కారణమవుతుండగా.. కాలేయం (Liver), గుండె (Heart)సమస్యలు, రొమ్ము క్యాన్సర్ (cnacer), ఊబకాయం, సంతానోత్పత్తి, నిద్ర, శక్తి సమస్యల ప్రమాదం ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ లిస్ట్‌లో ఉన్నాయి.

(Beer:‘బీర్‌’తో అల్జీమర్స్ వ్యాధి మాయం)

మద్యం స్త్రీని లైంగికంగా ఎలా ప్రభావితం చేస్తుంది?

ఆల్కహాల్ వినియోగం లైంగిక (sexuval)ప్రేరేపణను పెంచుతుందని, లిబిడో (libido)ను మెరుగుపరుస్తుందని విస్తృతంగా నమ్ముతారు. కానీ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (National Center for Biotechnology Information) ‘NCBI’ ఉదహరించిన అనేక అధ్యయనాలు మిశ్రమ అభిప్రాయాలను అందిస్తున్నాయి. ఆల్కహాల్ లైంగిక నిరోధాలు లేదా ఆందోళనలను అధిగమించడంలో సహాయపడుతుందనేది నిజమే కానీ ఇది మహిళల యోని పొడిగా మారేందుకు కారణమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యోని సెల్ఫ్-లూబ్రికేట్ (Self-lubricating) కానప్పుడు స్త్రీలు సెక్స్ డ్రైవ్ అధిక భావాన్ని అనుభవించినప్పటికీ,  అది ఫైర్‌ (fire)ను ఆర్పుతుందని అంటున్నారు.

ఆల్కహాల్‌తో సెక్స్ డ్రైవ్‌ ఎఫెక్ట్?

లైంగిక ప్రేరేపణ ఉద్వేగానికి ముఖ్యమైన కేంద్ర నాడీ వ్యవస్థను అణచివేయడం ద్వారా ఆల్కహాల్ పనిచేస్తుందని నిపుణులు తెలిపారు. ‘సాధారణంగా మద్యం సేవించడం నిర్జలీకరణానికి కూడా దారి తీస్తుంది. ఇది ఒకరి లైంగిక ప్రేరేపణ లేదా లిబిడోను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే జననేంద్రియాలకు ఆక్సిజన్ (Oxygen) ఎక్కువ అనుభూతిని తీసుకురావడానికి కొంత రక్తం అవసరం. కానీ నిర్జలీకరణం క్రమంగా అలసట, తలనొప్పి, యోని పొడి బారడానికి కారణమవుతుంది. తద్వారా తక్కువ లైంగిక ప్రేరేపణకు దారితీస్తుంది. 

(Hyderabad:హైదరాబాద్‌లో గ్లోబల్ రేస్ ఈవెంట్‌)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -