end
=
Tuesday, October 14, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌22 వరకు చల్లదనమేనా? కారణం తెల్సా?
- Advertisment -

22 వరకు చల్లదనమేనా? కారణం తెల్సా?

- Advertisment -
- Advertisment -

భూమి (Earth) సాధారణంగా (Sun) సూర్యుడి చుట్టూ గుండ్రంగా కాకుండా, అండాకారపు కక్ష్యలో తిరుగుతుంది. ఈ కక్ష్యలో భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని పెరిహీలియన్ (Perihelion) అంటారు. ఇది సాధారణంగా జనవరిలో సంభవిస్తుంది. అలాగే భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్నప్పుడు దాన్ని అప్హెలియన్ (Aphelion) అంటారు. ఇది సాధారణంగా జూలై మొదటి వారం(July First Week)లో సంభవిస్తుంది. ఆగస్టు 22 వరకు వాతావరణం గత సంవత్సరం కంటే చల్లగా ఉంటుంది.

ఈ సమయంలో భూమి సూర్యుడి నుంచి సుమారు 152 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సమయంలో మునుపెన్నడూ అనుభవించని విధంగా చల్లని ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. దీంతో శరీర నొప్పులు, గొంతు రాపిడి, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. కానీ, శాస్త్రవేత్తలేమంటారంటే.. భూమి సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు వాతావరణం చల్లగా మారుతుందని కొందరనుకుంటారు.

కానీ, ఇది నిజం కాదు. భూమిపై వాతావరణ మార్పులకు ప్రధాన కారణం సూర్యుడి నుంచి దూరం కాదు, భూమి అక్షం వంపు (axial tilt). ఈ వంపు వల్ల సూర్యరశ్మి భూమిపై వివిధ ప్రాంతాల్లో వివిధ కోణాలలో పడుతుంది, దీనివల్లే మనకు వేసవి, శీతాకాలాలు ఏర్పడతాయి. అప్హెలియన్ సమయంలో భూమి సూర్యుడికి దూరంగా ఉన్నప్పటికీ, మనకు వేసవి కాలం ఉంటే ఆ వేడి తగ్గదు. అప్హెలియన్, ఫినామినాన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రచారం ఉంది.

కానీ వాతావరణంలో సాధారణ మార్పులు, వేడి లేదా చలి కాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి.

జాగ్రత్తలు:

  • విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి తగినంత నీరు తాగడం ముఖ్యం.

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అందువల్ల, ఇలాంటి భౌగోళిక మార్పుల గురించి భయపడాల్సిన అవసరం లేదు.

  • కానీ మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎల్లప్పుడూ మంచిదే. ప్రకృతిలో జరిగే ఈ అద్భుతమైన సంఘటనల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -