‘దసరా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని(Natural Star), శ్రీకాంత్ ఓదెల(Director Srikanth Od కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా హైదరాబాద్ నేపథ్యంతో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నది. తాజాగా విడుదలైన నాని ఫస్ట్‌లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో నాని గుబురు గడ్డం, కోరమీసంతో పాటు ప్రత్యేకంగా కనిపించే రెండు జడలతో సరికొత్త లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లుక్, దాని వెనకున్న కథ అద్భుతంగా ఉందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోని ఆయన పాత్ర పేరు ‘జడల్’ అంటూ చిత్రబృందం ప్రకటించింది. “ఇది ఒక అల్లికగా ప్రారంభమై విప్లవంగా ముగిసింది” అనే క్యాప్షన్ ఈ పాత్రకున్న ప్రత్యేకతను, కథలోని డెప్త్‌ను సూచిస్తోంది. ఈ పోస్టర్ నాని క్యారెక్టర్ ఎలివేషన్‌ను, సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. నాని తన పాత్రల ఎంపికలో ఎంత వైవిధ్యం చూపిస్తారో మరోసారి ఈ లుక్ ద్వారా రుజువు చేశారు. ఆయన నటన, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 26న ఏకంగా ఎనిమిది భాషల్లో విడుదల కానున్నది. రాఘవ జూయాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.