ఇండియన్ టాప్ నటులు(Indian Top Stars) హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న’వార్ 2′(WAR-2 Movie) సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. యష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్(Yash Raj Film Univereలో భాగంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో చిత్రం రూపొందింది. చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీధర్ రాఘవన్ కథ అందించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌లో హృతిక్, ఎన్టీఆర్ రౌద్ర రసాన్ని పండించినట్లు కనిపిస్తున్నది. ఇద్దరి మధ్య నువ్వా ?నేనా? అన్నట్టుగా పోరాట సన్నివేశాలు కనిపించాయి. ట్రైలర్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ సందర్భంగా కథా రచయిత శ్రీధర్ రాఘవన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మాతృభూమి రక్షణ కోసం ప్రమాదకరమైన కోవర్ట్ ఆపరేషన్‌లోకి ఇద్దరు ఏజెంట్లు అడుగుపెడతారు. అవసరమైతే దేశం కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడరు. అలాంటి వారి ధైర్యసాహసాలను, పోరాటాన్ని తెరపై అత్యద్భుతంగా చాటిచెప్పడానికి స్పై యూనివర్స్ సృష్టించాం. చిత్రం థియేటర్లలో హై ఫీల్ ఇస్తుందనడంలో సందేహం లేదు. దేశం కోసం పోరాడే ఇద్దరు ఏజెంట్లు ఒకరితో మరొకరు ఎందుకు తలపడాల్సి వచ్చిందన్నది సినిమాలో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అసలు ఈ ఇద్దరిలో నిజమైన ఏజెంట్ ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే అంశం థ్రిల్ పంచుతుంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసేలా ‘వార్ 2’ ఉండబోతుంది’ అని చెప్పారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.