end
=
Saturday, January 10, 2026
వార్తలుఅంతర్జాతీయంభారత్ సహా పలు దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించే యోచనలో ట్రంప్?
- Advertisment -

భారత్ సహా పలు దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించే యోచనలో ట్రంప్?

- Advertisment -
- Advertisment -

America : ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి మరింత పెంచే దిశగా, రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధించే ద్వైపాక్షిక బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ బిల్లు అమలులోకి వస్తే, రష్యా నుంచి చమురు, యురేనియం వంటి కీలక వనరులు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ స్థాయిలో సుంకాలు విధించే అధికారం లభించనుంది. అవసరమైతే 500 శాతం వరకు సుంకాలను పెంచే వెసులుబాటు కూడా ఈ బిల్లులో ఉంది. ఈ అంశాన్ని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అనంతరం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన స్పందించారు.

ఈ బిల్లు చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని, తద్వారా అవి రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రాహం తెలిపారు. రష్యా చమురు ఆదాయమే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని కొనసాగించడానికి ప్రధాన ఆర్థిక ఆధారమని, ఆ నిధులను కట్ చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వారం ఈ బిల్లు అమెరికా సెనేట్‌లో ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపారు. ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. గత ఏడాది రష్యా చమురు దిగుమతుల కారణంగా భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతిపాదిత కొత్త బిల్లు అమలైతే, భారత్‌తో పాటు ఇతర దేశాలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషంగా మారింది. ఒకవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు ఇలాంటి కఠిన ఆంక్షలకు మద్దతు ఇవ్వడం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలన్న వ్యూహాన్ని ట్రంప్ అనుసరిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపుతామని చెబుతూనే పుతిన్ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని లిండ్సే గ్రాహం తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై భారత్, చైనా వంటి దేశాలు తమ నిర్ణయాలను పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -