end
=
Wednesday, August 6, 2025
సినీమాఆ చిత్రంలో జాక్వెలిన్​ !
- Advertisment -

ఆ చిత్రంలో జాక్వెలిన్​ !

- Advertisment -
- Advertisment -

దేశంలోనే అందాల తారగా పేరున్న దీపికా పదుకొనే ఇప్పటికే తెలుగు తెరపై కనిపించి సందడి చేశారు. తమ అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. మరో హలీవుడ్​ తార ప్రియాంకా చోప్రా సూపర్​ స్టార్​ మహేశ్​బాబు చిత్రంలో కనువిందు చేయనున్నారు. ఈ కోవలోకి ఇప్పుడు మరో అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేరనున్నారు. ఇప్పటికే ‘సాహో’ చిత్రం (Saho Movie)లో ఒక స్పెషల్​ సాంగ్​(Special Song)లో తళుక్కుమన్నారు. ఇక ఆమె తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం(Woman Oriented Movie)తో ప్రేక్షకులను పలకరించనున్నారు. టాలీవుడ్​ దర్శకుడు వీ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ అందాల భామ తెలుగులో నేరుగా ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన కథను దర్శకుడు జయశంకర్ ఇప్పటికే జాక్వెలిన్‌కు వినిపించినట్లు సమాచారం. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఒక యాక్షన్ లేడీగా కనిపించనుందని, ఇది తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -