సిద్ధార్థ్ మల్హోత్రా (Siddardh Malhotra), జాన్వీ కపూర్ (Janvi Kapoor) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ (Param Sundrar Movie). దర్శకుడు తుషార్ జలోటా (Director Tushar Jolata) ఈ సినిమా తీస్తున్నారు. ఉత్తరాది అబ్బాయి(Northen Boy), దక్షిణాది అమ్మాయి (Southern Girl) ప్రేమకథతో తెరకెక్కిస్తున్నారు. దినేశ్ విజన్ నిర్మిస్తున్న చిత్రం ఈ నెల 29న విడుదల కానున్నది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, తాజాగా ‘భీగి శారీ’ అనే రొమాంటిక్ పాటను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వర్షాకాలానికి తగ్గట్టుగా ఉన్న ఈ పాట యువతను ఉర్రూతలూగిస్తున్నది. పాటలో సిద్ధార్థ్, జాన్వీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా, తడిసిన చీరలో జాన్వీ కపూర్ అందాలు ఆకట్టుకున్నాయి.
పాటకు అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించగా, సచిన్ సంగీతం అందించారు. అద్నాన్ సమీ, శ్రేయా ఘోషల్ యుగళగీతం ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.