మరోసారి వైద్య పరీక్షలు
మాజీ సీఎం(Ex Cm), బీఆర్‌ఎస్ అధినేత (Brs Chief) కేసీఆర్ (KCR) గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు మరోసారి వైద్యులు వైద్య పరీక్షలు (Medical Tests) చేశారు. తన ఆరోగ్యం కుదుటపడిందని తెలుసుకున్న తర్వాత కేసీఆర్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 3న కూడా ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పడు బ్లడ్ షుగర్, సోడియం స్థాయులను పరీక్షించి వైద్యం చేశారు.
ఆయన్ను రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. కేసీఆర్ అక్కడే ఉండి చికిత్స పొంది 5న డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు. ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ ఆసుపత్రికి వచ్చారు.