end
=
Saturday, August 16, 2025
సినీమాషాహిద్ కపూర్ సరసన కృతి
- Advertisment -

షాహిద్ కపూర్ సరసన కృతి

- Advertisment -
- Advertisment -

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తాజాగా ‘తేరే ఇష్క్ మే’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ సరసన నటించేందుకు కృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. 2012లో విడుదలై ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘కాక్‌టెయిల్’ చిత్రనానికి సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ చిత్రానికి దర్శకుడు హోమీ అడాజానియా దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు చివరి వారం నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా కథానాయికగా కృతిని ఎంపిక చేశారని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి సుముఖత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఇది నిజమైతే, బాలీవుడ్‌లో కృతి సనన్ జోరు మరింత పెరిగినట్టే అవుతుంది. ‘కాక్‌టెయిల్’ సీక్వెల్‌లో కృతి నటిస్తోందని తెలిసి ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -