మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) దర్శకత్వంలో ‘మెగా157’ (Mega 157 title) టైటిల్‌తో చిత్రం శరవేగంగా షూటింగ్ (Fastest Shooting Going) జరుపుకొంటున్నది. షైన్‌స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. చిత్రంలో చిరంజీవి సరసన కథానాయికగా లేడి సూపర్‌స్టార్ నయనతార నటించనున్నారు. మంగళవారం ఆమె షూటింగ్లో పాలుపంచుకున్నారు. చిరంజీవి వింటేజ్ అవతార్‌లో, డబుల్ యాక్షన్‌లో కనిపించనున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సమీర్రెడ్డిగా పనిచేస్తున్నారు.